మాజీ మంత్రి సీఎం కేసీఆర్ కు కవిత బిగ్ షాక్ ఇచ్చారు. గులాబీ పార్టీకి సంబంధించిన కొన్ని విషయాలను లేఖ ద్వారా కవిత కెసిఆర్ కు తెలియజేశారు. బీఆర్ఎస్ పార్టీ ఒకప్పటి లాగా లేదు. ఇందులో చాలా మార్పులు చేయాలని కవిత అన్నారు. బిజెపి పార్టీకి మీరు అనుకూలంగా ఉంటున్నారని చాలామంది జనాలు అనుకుంటున్నారు. గులాబీ పార్టీ, బిజెపి పార్టీ కలిసిపోయిందని మీరు కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే వ్యతిరేకంగా ఉండడంతో జనాలకు అనేక రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని కవిత వెల్లడించారు. 


కొద్దిరోజుల క్రితం వరంగల్ లో ఏర్పాటు చేసిన సభలో మీరు ఒక్కరే మాట్లాడడం కాకుండా సీనియర్ లీడర్లతో కూడా మాట్లాడిస్తే చాలా బాగుండేది. అలా చేయడం వల్ల మీరు గులాబీ పార్టీలో ఉన్న నాయకులను పట్టించుకోవడంలేదని కొంతమంది అనుకుంటున్నారని కవిత లేఖ ద్వారా వెల్లడించింది. అంతేకాకుండా కెసిఆర్ చుట్టూ కొన్ని దయ్యాలు తిరుగుతున్నాయని కవిత అన్నారు. వారి వల్ల చాలా నష్టం జరుగుతుందని చెప్పారు. ఈ లేఖ కాస్త వైరల్ గా మారింది. ఈ లేఖపైన కేటీఆర్ సీరియస్ అయ్యారు. గులాబీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు కేసీఆర్ కు లేఖలు రాయవచ్చు కానీ ఇలా కవిత తరహాలో లేఖలు రాసి లోపాలు, తప్పిదాలను బయట పెట్టవద్దు. 

అలా చేస్తే చర్యలు తీసుకుంటామని కేటీఆర్ చెప్పకనే చెప్పాడు. కవిత చేసిన దయ్యాల కామెంట్లపై కూడా కేటీఆర్ స్పందిస్తూ తెలంగాణలో రేవంత్ రెడ్డి అనే దయ్యం మాత్రమే ఉన్నాడు. గులాబీ పార్టీలో దయ్యాలు లేవని స్పష్టం చేశాడు. కవిత ఇలా లేఖ రాయడంతో గులాబీ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతుందా అనే సందేహంలో చాలామంది ప్రజలు ఉన్నారు. మరో రెండు రోజులలో కవితపై సస్పెన్షన్ విధించే అవకాశాలు ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ విషయం పైన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ : వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: