చూస్తుంటే ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య వార్ రోజు రోజుకి మరింత తీవ్రస్థాయిలో పెరిగిపోతుందని చెప్పాలి. గత కొన్ని రోజులుగా ఇరాన్ - ఇజ్రాయిల్ దేశాల మధ్యయుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి అందరికీ తెలిసిందే.  ఇరుదేశాలు ఒకరిపై ఒకరు మిస్సైల తో .. బాంబులతో దాడులు చేసుకుంటున్నాయ్ పరిస్థితి పూర్తిగా చేతులు దాటిపోయింది . దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి . ఇరుదేశాల మధ్య యుద్ధం తీవ్రమవుతున్న వేళల్లో అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగి మిలటరీ ఇరాన్లోని మూడు అణుకేంద్రాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసి .. ఆ ప్రాంతాలను పూర్తిగా ధ్వంసం చేశాయి.


 బి 2 స్పిరిట్ బాంబర్లతో ఇరాన్ లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫాహన్ అణు కేంద్రాలపై భారీ దాడులు చేసింది అమెరికా. అమెరికా ఇదే విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించింది.  ఇరాన్ ఘనతల బయట నుంచి ఈ దాడులు చేయడం గమనార్హం . ఈ దాడుల తర్వాత అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ "ఇరాన్ కి శాంతి కావాలా..? విషాదం కావాలా..? తేల్చుకోవాలి అంటూ ఓపెన్గానే హెచ్చరించారు.  చెప్పిన మాట వినకుంటే పరిస్థితి పూర్తిగా చేజారిపోతుంది అని ఇరాన్ లో మిగిలిన లక్ష్యాలు అన్నిటిని కూడా అంతం చేస్తామంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు".  అయితే ఈ వార్నింగ్ ఇచ్చి 24 గంటల కాకముందే ఇరాన్ కి సపోర్ట్ చేస్తూ పాకిస్తాన్ సంచలన ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది .


"ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌కు చెందిన అణు సదుపాయాలపై అమెరికా దాడులను పాకిస్థాన్ ఖండిస్తుంది. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింతగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మేము తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. ఈ దాడులు అంతర్జాతీయ న్యాయ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని, మరియు ఐక్యరాజ్యసమితి చార్టర్ ప్రకారం ఇరాన్‌కి తనను తాను రక్షించుకునే హక్కు ఉందని మేము పునరుద్ఘాటిస్తున్నాము. ఇరాన్‌పై కొనసాగుతున్న దౌర్జన్యంతో విపరీతంగా పెరిగిన ఉద్రిక్తతలు మరియు హింస తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ఇకపై ఉద్రిక్తతలు పెరగడం ఈ ప్రాంతానికి మరియు దాని పరిసరాలకు తీవ్రమైన ప్రభావాలు చూపుతాయి. ప్రజల ప్రాణాలు మరియు ఆస్తులను గౌరవిస్తూ, వెంటనే ఈ ఘర్షణకు ముగింపు పలకాలి అంటూ కోరుకుంటున్నాం . అన్ని కంట్రీస్ అంతర్జాతీయ న్యాయానికి, ముఖ్యంగా అంతర్జాతీయ మానవతా చట్టానికి విధేయంగా ఉండాలి"..అంటూ రాసుకొచ్చింది.


ఆశ్చర్యం ఏంటంటే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు వచ్చే ఏడాది నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి అని కోరుతూ ఆయన పేరుని అధికారికంగా ప్రతిపాదించాలి అని నిర్ణయించినట్లు పాకిస్తాన్ ప్రభుత్వం శనివారమే వెల్లడించింది. అలా పేరు ప్రతిపాదించాలని నిర్ణయించుకుని 24 గంటలు కాకముందే ఈ విధంగా డోనాల్డ్ ట్రంప్ ఇరాన్ అణు స్ధావరాలపై దాడులు చేయడం తీవ్ర కలకలం రేపుతుంది. ఇప్పుడు నోబెల్ శాంతి బహుమతికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేరును ప్రతిపాదించాలని చూసిన పాకిస్తాన్ఆ నిర్ణయం నుంచి వెనక్కి వస్తుందా..? లేదా ..? అనేది బిగ్ క్వశ్చన్ మార్క్ . అంతేకాదు నోబుల్ శాంతి బహుమతికి అమెరికా అధ్యక్షుడు పేరు ప్రతిపాదించాలని పాకిస్తాన్ నిర్ణయించుకున్నప్పటినుంచి ఇంటా బయట కూడా తీవ్ర నిరసనల వ్యక్తం అవుతున్నాయి. పాక్ సర్కార్ తీరును పలువురు తప్పుపట్టారు కూడా. ఒకవైపు గాజాలో మారణ హోమం సృష్టిస్తూ .. మరొకవైపు ఇలా రక్తం  పారిస్తున్న ఇజ్రాయిల్ కు మద్దతిస్తున్నందుకు ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలా ..? అంటూ మండిపడుతున్నారు..!






మరింత సమాచారం తెలుసుకోండి: