
ఇక మంత్రి సత్యప్రసాద్ రెవెన్యూ శాఖకు ప్రాతినిధ్యం ప్రస్తుతం వహిస్తూ ఉన్నారు. ఈయన పనితీరు కూడా ఏమాత్రం బాగాలేదనే విధంగా వినిపిస్తున్నాయి. నారా లోకేష్ స్నేహితుడు కావడం చేత మంత్రి పదవి వచ్చిందని కానీ అంతటి గుర్తింపుని సంపాదించుకోలేకపోతున్నారనే విధంగా చాలా మంది నేతలు మాట్లాడుతున్నారు. ఇక సీఎం చంద్రబాబు కూడా తన క్యాబినెట్లో పనిచేస్తున్న మంత్రులకు కూడా ర్యాంకులు ఇవ్వగా అనగాని సత్యప్రసాద్ కు అడుగు నుంచి 5వ స్థానం పై నుంచి 21వ స్థానం లభించింది. దీన్ని బట్టి చూస్తే రెవెన్యూ శాఖ పనితీరు ఏపీలో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
మీ భూమి పోర్టల్ పనిచేయకపోవడంతో చాలామంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. సాధారణంగా ఒకటి రెండు రోజులు ఏదైనా సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు ఎదురైన ఆ తర్వాత పనిచేస్తూ ఉండేది. కానీ ప్రస్తుత పరిస్థితులలో కొన్ని నెలలుగా మీ భూమి పోర్టల్ పనిచేయలేదు. ఇక రెవెన్యూ శాఖలో ఇదొక్కటే సమస్య కాదు నిషేధిత జాబితాలో కూడా చాలా భూములను అన్యాయంగా పెట్టారంటూ రైతులకు కూడా వాపోతున్నారు. దీనివల్ల రిజిస్ట్రేషన్ భూములు ప్రక్రియ కూడా ఆగిపోయింది. చట్టబద్ధమైన కొన్ని హక్కులు కలిగి ఉన్న భూములు కూడా ఉపయోగించుకోలేని పరిస్థితి ఎప్పుడు ఏర్పడింది.. ముఖ్యంగా డాటెడ్ ల్యాండ్స్, డి పట్ట ల్యాండ్స్ పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది.