సాధారణంగా పరీక్షలు అనగానే చాలా మంది ఒక్కసారి రాస్తే చాలని విద్యార్థులు అనుకుంటూ ఉంటారు. ఇందులో పాస్ అయిపోతే చాలని చాలామంది అనుకోవడం మరికొంతమందికి మార్కులు తక్కువగా వచ్చాయని నిరుత్సాహం తో ఉంటారు. ఇక మీదట ఇలాంటి వాటికి టెన్షన్ పడాల్సిన పనిలేదు. ఎందుకంటే రాబోయే పదవ తరగతి ఎగ్జామ్స్ కు సంబంధించి ఒక న్యూస్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. పదవ తరగతి పరీక్షలపై సీబీఎస్సీ కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2026 నుంచి ఏడాదికి రెండుసార్లు పదవ తరగతి పరీక్షలు నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి అధికారికంగా కూడా ఉత్తర్వులను జారీ చేశారు సీబీఎస్సీ.



ఫిబ్రవరి, మే నెలలో ఈ పరీక్షలు జరుగుతాయని.. అయితే మొదటి దశ పరీక్షలకు సంబంధించి హాజరు కావలసిన అవసరం కచ్చితంగా ఉంటుంది.. అయితే రెండవ దశ పరీక్షలు అనేది ఆప్షనల్ అని సిబిఎస్సి తెలియజేసింది.. మొదటి దశ పరీక్షలు సైతం ఫిబ్రవరిలో ఆ తరువాత రెండవ దశ పరీక్షలు మే నెలలో నిర్వహిస్తారట. వీటి ఫలితాలు వరుసగా ఏప్రిల్ ,జూన్ నెలలోనే ప్రకాటిస్తామంటూ సీబీఎస్సీ  వెల్లడించారు. అయితే విద్యార్థులు తాము ఎంచుకొనే సబ్జెక్టులలోని భాషలలో మరొకసారి రాసుకునే అవకాశం కల్పిస్తుందట. వీటి ద్వారా స్కోర్ పెంచుకోవడానికి ఉపయోగపడుతుందని అందుకు రెండవ దశ పరీక్షలు రాయాల్సి ఉంటుందని తెలుపుతున్నారు.


ఫిబ్రవరిలో సీబీఎస్సీ మాసాయిదా నిబంధనలకు ప్రకారమే వీటిని ప్రకటించామని తాజాగా వీటిని ఆమోదం పొందింది అంటూ కొన్ని పోస్టులు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. విద్యార్థులు మార్కులు ఎక్కువ గా పెంచుకోవాలి అనుకునే వారికి ఒక గుడ్ న్యూస్వంటిది చెప్పవచ్చు.  అయితే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు  కూడా ఈ విధంగానే అమలు చేసేలా సన్నహాలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇవి ఏ మేరకు విద్యార్థులకు ఉపయోగపడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: