యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రపంచంలోనే అగ్ర రాజ్యాంగ పేరు సంపాదించింది అందుకు తగ్గట్టుగానే 80 దేశాలలో 750 కంటే ఎక్కువ సైనిక స్థావరాలను నిర్మించుకుంది.కానీ ఇండియాలో మాత్రం ఒక్క అమెరికన్ సైనిక స్థావరం కూడా లేకపోవడం గమనార్హం. అందుకు గల కారణం ఏంటి ఇండియాలో అమెరికా సైనిక స్థావరాలకు అనుమతి ఇవ్వడం ఎందుకు జరగలేదనే విషయంపై ఇప్పుడు పూర్తిగా చూద్దాం


భారతదేశం తన వ్యూహాత్మక స్వాతంత్రాన్ని కాపాడుకోవడంలో ముందు ఉంటుంది. ప్రపంచంలోకెల్లా నాలుగోవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగి ఉన్నది. అలాగే ఒక శక్తివంతమైన సైన్యం, అనుయుద్ధాలు, అదునాథున నవవికాదళం, అటు సైబర్ యుద్ధం, అంతరిక్ష సామర్ధ్యాలను కూడా కలిగి ఉంది. అందుకే ఇండియాకి విదేశీ సైనిక స్థావరాల అవసరం లేకుండానే చేసుకున్నది. అయితే ఇండియాలో తమ భూభాగం పైన విదేశీ స్థావరాలకు స్థానం కల్పించకపోవడానికి ముఖ్య కారణం వీటిని అనుమతించడం వల్ల ఇతర దేశాలకు కూడా వ్యతిరేకం అయ్యే అవకాశం ఉందని ఇక్కడ వాటికి  ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదట.


ప్రస్తుతం ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతోంది ఈ యుద్ధంలో అమెరికా ఇరాన్ పైన దాడి చేయగా అందుకు ప్రతికారంగా అమెరికా సైనిక స్థావరం ఉన్నటువంటి వాటిని లక్ష్యంగా చేసుకొని ఇరాన్ దాడి చేస్తోంది. ఇటువంటి దృష్టిలో పెట్టుకొని విదేశీ స్థావరాలను భారత్లో అనుమతించలేదని తెలుస్తోంది. అయితే ఇండియా తమ సైనిక స్థావరాలను విదేశాలలో కూడా స్థాపించడంలో కొంతమేరకు సమయం పాటిస్తున్నట్లు తెలుస్తోంది. చాలా పరిమితంగానే ఇతర దేశాలలో భారత సైనిక స్థావరాలు కలిగి ఉన్నాయి. అయితే అవి కేవలం సహకారం, సమ్మతి ఆధారంగానే నడుస్తూ ఉన్నాయి. అమెరికాతో అటు భారత్కు సైనిక విన్యాసాలు, లాజిస్టిక్ ఒబ్బందాలు కలిగి ఉన్నాయి.. 1947 నుంచి ఇండియా తమ విదేశాంగ విధానంలో స్వతంత్ర సూత్రాన్ని కాపాడుకుంటూ వస్తోంది. అందుకే భారతదేశంలో ఇతర దేశాల సైనిక స్థావరాలకు భూమి అనుమతించకుండా చేస్తోందట.

మరింత సమాచారం తెలుసుకోండి: