చాలా సంవత్సరాల క్రితం ప్రస్తుతం మూడు దేశాలుగా ఉంటున్న ఇండియా , పాకిస్తాన్ , బంగ్లాదేశ్ కలిసి ఉన్నాయి. కానీ ఆ తర్వాత ఇవి మూడు దేశాలుగా విడిపోయాయి. ఇకపోతే మూడు దేశాలుగా విడిపోయిన వీటిలో భారతదేశంలో హిందువులు , ముస్లీంలు , క్రైస్తవులు కలిసి ఉన్న విధంగా పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ లో కలిసి ఉండరు. పాకిస్తాన్ , బంగ్లాదేశ్ ఈ రెండు దేశాల్లో కూడా ముస్లిం జనాభా అత్యధికంగా ఉంటుంది. దానితో హిందువులకు ఈ ప్రాంతంలో కాస్త , కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి. ఇకపోతే బంగ్లాదేశ్ లో తాజాగా కూడా ఇలాంటి పరిస్థితి ఎదురయ్యింది.

అసలు విషయం లోకి వెళితే ... బంగ్లాదేశ్ లో హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత అక్కడ అమెరికా డిప్యూట్ చేసినటువంటి వారు వచ్చి పరిపాలన స్టార్ట్ చేసిన తర్వాత హిందువులపై దాడులు కాస్త పెరిగిపోయాయి. ఇప్పటికే ఇలాంటి దాడులు బంగ్లాదేశ్ లో చాలా జరిగాయి. ఇకపోతే తాజాగా మరో సంఘటన జరిగింది. ఇది బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులను మాత్రమే కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్న హిందువులందరినీ కూడా ఆ సంఘటన కలచివేస్తుంది. తాజాగా బంగ్లాదేశ్ లో దుర్గమ్మ అమ్మవారికి సంబంధించిన ఆలయాన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వం వారు కూల్చివేశారు. ఇకపోతే బంగ్లాదేశ్ లో బెంగాలీలు ఎక్కువగా ఉంటారు. వారు దుర్గమ్మ వారిని ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. అలాంటి ప్రాంతంలో ఉన్న దుర్గమ్మ ఆలయాన్ని కూల్చివేయడంతో అక్కడ ఉన్న హిందువులు దీనిపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు.

అలాగే భారత దేశ ప్రభుత్వం కూడా దీనిపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తుంది. ఇలా బంగ్లాదేశ్ ప్రభుత్వం హిందువులు ఎంతో పవిత్రంగా పూజించే దుర్గమ్మ వారి ఆలయాన్ని కూల్చివేయడం పై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇది ప్రభుత్వ అధికారుల సమక్షంలో జరగడం మరింత పెద్ద ఎత్తున నిరసనకు దారి తీస్తుంది. మరి ఈ సంఘటనపై బంగ్లాదేశ్ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: