
దీంతో ఆ బాధితురాలికి ఊపిరి అందకపోవడంతో ఇన్ హెలర్ ఇచ్చి మరి ఆమె పైన అత్యాచారం చేశారు. ఆమె ఎంత వేడుకున్నా కూడా తనని వదిలిపెట్టలేదని హాకీ స్టిక్కతో కొట్టారు. అంతేకాకుండా ఈ సంఘటన ఎవరికైనా చెప్పిన తల్లిదండ్రులను చంపేస్తామంటూ బెదిరించారట. అయితే నిందితులలో ఒకరైన పూర్వ విద్యార్థి ఈమెను పెళ్లి చేసుకోవడానికి ప్రపోజల్ తీసుకురావడంతో నిరాకరించిందని అందుకే ఈ కిరాతకానికి పాల్పడ్డట్టుగా అధికారులు తెలియజేస్తున్నారు.
ఇక ఈ విద్యార్థులు కోల్కతాలోని కస్బా ప్రాంతంలో సౌత్ కళాశాలలో చదువుతున్నారు ఈ సంఘటన బుధవారం రాత్రి జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణమైన సంఘటనకు సంబంధించి బాధితురాలు కుటుంబ సభ్యులు గురువారం రోజున ఫిర్యాదు చేశారు. ఇందులో మనోజిత్ మిశ్రా, జైబ్ అహ్మద్, ప్రమిత్ ముఖర్జీ నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇందులో పూర్వ విద్యార్థి మనోజిత్ మిశ్రా.. అయితే ఇదే కళాశాలలో ఉద్యోగి అయిన మనోజిత్ మిశ్రా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగంలో కూడా కొనసాగుతున్నారట.
బాధితురాలు ఫిర్యాదులో.. మనోజిత్ , జైబ్ ,ప్రమిత్ తనని మొదట అడ్డుకున్నారని ఒక గదిలో పెట్టి గడివేశారని.. మనోజిత్, ప్రమిత్ బయట ఉండగా జైబ్ ఆమెను అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారని తెలిపింది. అయితే ఆ బాధితురాలు తాను మరొకరితో ప్రేమలో ఉన్నానని తనను వదిలేయమని కాళ్లు పట్టుకున్న కూడా వదలలేదని తెలిపింది.. వారి నుంచి తప్పించుకొని ఈ విద్యార్థి బయటకు వెళుతున్న సమయంలో మెయిన్ గేటు వద్ద ఈ నిందితులు అడ్డుకొని ఆమెను ఈడ్చుకొని వెళ్లి మరి వివస్త్రను చేశారు జైబ్ అంటూ తెలియజేసింది.. వారిద్దరు చూస్తూ ఉండగానే జైబ్ అత్యాచారం చేశారని తెలిపింది.అయితే సెక్యూరిటీ గార్డు కూడా నిస్సహాయంగా గది బయట ఉండిపోయారని.. తనని హాకీ స్టిక్తో కొట్టి ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించి రాత్రి 10:50 గంటలకు విడిచిపెట్టారంటూ ఫిర్యాదు చేసింది.. లా విద్యార్థి జరిగిన సంఘటన పైన జాతీయ మహిళా కమిషనర్లు తీవ్రంగా స్పందించారు ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించారు.. ఇందులో రాజకీయ హస్తం కూడా ఉండడంతో కోల్కతా ఘటన తీవ్రస్థాయిలో వినిపిస్తోంది. బిజెపి నేతలు కూడా ఫైర్ అవుతున్నారు.