
అయితే ఈ పథకంలో అమలులో భాగంగా తాజాగా ఒక అప్డేట్ ను అయితే ఏపీ ప్రభుత్వం తెలియజేసింది. అదేమిటంటే ఇప్పటివరకు 98% వరకు రైతులకు ఈకేవైసీ పూర్తి అయ్యింది అంటూ తెలియజేశారు.. మిగిలిన రెండు శాతం మాత్రమే ఈ కేవైసీ మిగిలి ఉన్నదని. సొంత భూమి కలిగి ఉండి డీ పట్టాదారులు, ఆన్ సైన్ భూములు, ఇనాం భూములు కలిగి ఉన్న రైతులకు కూడా ఈ పథకాన్ని వర్తింపచేసేలా ఉంటుంది అంటూ ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే గతంలో కేవలం ఒరిజినల్ పట్ట కలిగి ఉన్న భూములకు మాత్రమే అన్నదాత సుఖీభవ అమలు అంటూ ఏపీ ప్రభుత్వం ఎక్కువగా విమర్శలు వినిపిస్తూ ఉండడంతో అన్ని భూములకు వర్తింపచేసేలా చేస్తోంది. అయితే కౌలు రైతులకు సంబంధించీ.. కౌలు కార్డు కలిగి ఉండాలని అలాగే ఈ పంటలో కూడా నమోదు చేసుకొని ఉండాలని తెలియజేస్తున్నారు వీరికి రెండు విడతలుగా 20 వేల రూపాయలు పడుతుందట.
సూపర్ సిక్స్ లో భాగంగా అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తామని ఏడాదికి 20 వేల రూపాయలు ఆర్థిక సహాయం కూడా అందించబోతున్నామని తెలిపారు. ఇప్పటివరకు 47.77 లక్షల మంది రైతులు అర్హులుగా గుర్తించారట. ఇక అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి స్టేటస్ ని అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోవలసి ఉంటుంది.