తెలంగాణ బిజెపి పార్టీలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాతో ఒక్కసారిగా సంచలనంగా మారింది. ఈ రోజున ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లుగా ప్రకటించారు.ఈ లేఖను సైతం రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి అందజేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ పలు కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. తెలంగాణలో బిజెపి పార్టీలో చాలా లోసుగులు ఉన్నాయని కొంతమంది పార్టీని ఎదగకుండా చేస్తున్నారంటూ పలు రకాల ఆరోపణలు చేశారు. తన రాజీనామా లేఖ  ను కూడా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఇచ్చాను ఈ లేఖ స్పీకర్ కి పంపించమని చెప్పాను అంటూ వెల్లడించారు.


నాకు మద్దతు ఇచ్చిన వారందరినీ కూడా చాలామంది బెదిరించారని ఆరోపణలు చేశారు.అలాగే తనకు ముగ్గురు కౌన్సిల్ మెంబర్స్ కూడా మద్దతుగా నిలిచారని ఎవరిని ప్రెసిడెంటు చేయాలో ఆల్రెడీ వారు డిసైడ్ అయినప్పుడు ఎన్నిక ఎందుకు అంటూ ప్రశ్నించడం జరిగింది. తెలంగాణలో బిజెపి అధికారంలోకి రాకూడదనే వారి సంఖ్య రోజు రోజుకి ఎక్కువగా పెరుగుతోంది అంటూ వెల్లడించారు. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి తనని నామినేషన్ వేయనివ్వలేదు అంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపణలు చేశారు.


ఈ విషయం పైన లక్షలాదిమంది కార్యకర్తలు కూడా బాధపడుతున్నారని తెలియజేశారు. రామచంద్రరావుకు అధ్యక్షత పదవి ఇవ్వడంతో చాలామంది అసంతృప్తితో ఉన్నారంటూ వెల్లడించారు. నా నామినేషన్ పత్రం పైన సంతకం చేసేందుకు కూడా ఇప్పటికీ పదిమంది నాయకులు కూడా సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. అయితే తన మద్దతు దారులను నామినేషన్ పత్రం పైన సంతకం చేయనివ్వలేదంటూ వారిని బెదిరిస్తున్నారు అంటూ ఆవేదాన్ని తెలియజేశారు రాజాసింగ్. అంతేకాకుండా బీజేపీ అధ్యక్ష పదవికి కూడా తాను సిఫార్సు చేసిన అభ్యర్థిని పరిగణంలోకి తీసుకోకపోవడంతో కూడా అసంతృప్తితో ఉన్నానని తెలియజేశారు దీంతో ఆయన పార్టీని వీడానని తెలియజేశారు రాజాసింగ్. మరి ఈ విషయం పైన తెలంగాణ బిజెపి నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: