అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌తో వ్యాపార సంబంధాలపై చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. అమెరికా రాబోయే పాలనలో ట్రంప్ మళ్లీ అధ్యక్షుడిగా అభ్యర్థిత్వం చూపిస్తున్న తరుణంలో, భారత్‌తో ఒక “బిగ్ ట్రేడ్ డీల్”పై ఆయన చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి.

ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. “ఇండియాతో ఒక విభిన్నమైన ఒప్పందానికి మేము సిద్ధమవుతున్నాం. అది పూర్తిగా కొత్తగా ఉంటుంది. మేము పోటీ పడగలిగేలా ఆ డీల్ ఉంటుంది. ప్రస్తుతం భారత్ అమెరికన్ కంపెనీలను ప్రవేశించనివ్వడం లేదు. కానీ త్వరలో ఆ పరిస్థితి మారుతుంది” అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అతని ప్రకటనలో ప్రధానంగా టారిఫ్‌ల అంశం హైలైట్ అయింది. “భారత్ ఒప్పుకుంటే, టారిఫ్‌లు చాలా తక్కువగా ఉంటాయి” అని ట్రంప్ స్పష్టం చేశారు. దీనర్థం ఒక సదుపాయమైన ఒప్పందం జరిగితే, అమెరికా నుంచి వస్తువులపై భారత్ విధించే దిగుమతి సుంకాలు తగ్గుతాయని సంకేతాలు ఇచ్చారు. దీని వల్ల భారత మార్కెట్‌లో అమెరికా కంపెనీల ప్రవేశం పెరిగే అవకాశముంది.

అసలు వివాదం ఏంటి?
ట్రంప్ వ్యాఖ్యల్లో స్పష్టత లేని అంశం ఏమిటంటే.. ఇరు దేశాల మధ్య ప్రస్తుతం ఏ అంశంపై డీల్లో అభిప్రాయ భేదాలు ఉన్నాయన్నది వెల్లడించలేదు. గతంలో ట్రంప్ పాలనలో భారత్, అమెరికా మధ్య కొన్ని వ్యాపార ఒప్పందాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా, పామాయిల్, ఆగ్రికల్చర్, హార్డ్వేర్ దిగుమతులపై టారిఫ్‌లు, మౌలిక హక్కుల పరిరక్షణ, డిజిటల్ పౌరగోప్యత లాంటి అంశాల్లో అభిప్రాయ తేడాలు ఏర్పడినట్లు వార్తలు వచ్చాయి.

భారత్ కు ఇది అవకాశం అవుతుందా?
ప్రస్తుతం ట్రంప్ వ్యాఖ్యలు భారత ప్రభుత్వానికి ఓ అవకాశంలా కనిపిస్తున్నా, ఇది ఆర్థికంగా ఎంత మేర ఉపయోగకరమవుతుందన్నది స్పష్టత పొందాల్సిన విషయం. భారత్ ఇప్పటికే పలు దేశాలతో ఉచిత వాణిజ్య ఒప్పందాలు (FTA) చేసుకుంటున్న తరుణంలో, అమెరికాతో ఒప్పందం కుదిరితే భారీ ప్రయోజనాలు దక్కవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు.

ట్రంప్ వ్యాఖ్యలు రాజకీయంగా ఎంత హీట్ తీసుకువచ్చినా, వ్యాపార పరంగా భారత్‌కు తక్కువ టారిఫ్‌లు లభించడమంటే.. అదేమి చిన్న డీల్ కాదు . కానీ దీనికోసం భారత్ ఏమైనా తలొగ్గాల్సి వస్తుందా? టెక్, డిజిటల్ గవర్నెన్స్, పౌర గోప్యత వంటి కీలక అంశాల్లో తన నియంత్రణను భారత్ విరమించుకుంటుందా? అన్నదే ఇప్పుడు అసలైన ప్రశ్న.

మరింత సమాచారం తెలుసుకోండి: