
ఆంధ్రప్రదేశ్లో కేవలం రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తోందని లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిపోయిందని, ఆంధ్రప్రదేశ్ రక్త మోడుతోంది వైసీపీ పార్టీకి చెందిన చాలామంది నాయకులు, కార్యకర్తల పైన తప్పుడు కేసులు ఒక పథకం ప్రకారం పెడుతూ అరెస్టు చేస్తున్నారు. అది వీలు కాకపోతే తమ వాళ్లను ప్రోత్సహించి మరి దాడులు చేస్తున్నారు అంటు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించారు. గుంటూరు జిల్లాలోని మన్నవ గ్రామ దళిత సర్పంచ్ నాగమల్లేశ్వరరావుని సైతం కొంతమంది పట్టపగలే కొట్టి చంపే ప్రయత్నం చేశారు. అందుకు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాఫియా దుర్మార్గపు పాలనే నడుస్తుందంటూ తెలిపారు.
ఇక నాగమల్లేశ్వరరావు కుటుంబ మొదటి నుంచి ఎక్కువగా వైసిపి పార్టీలోనే ఉండడం ప్రజలలో వారికి మంచి పేరు ఉండడం అక్కడ ఉన్న టిడిపి వారికి అసలు నచ్చలేదట. ఎన్నోసార్లు చాలామంది బెదిరించిన భయపడిన కూడా వారు వెనకడుగు వేయకపోవడంతో అక్కడ రాజకీయంగా కూడా టిడిపి పార్టీకి ఇబ్బందులు తలెత్తడంతో స్థానిక ఎమ్మెల్యే తమ కార్యకర్తలను ఆ సర్పంచ్ పైన ఉసిగొలిపి దాడులు చేయించారట.. ఇక అందుకు సంబంధించి వీడియోలు చూస్తే ఆ దాడులను వారు ఎంత అన్యాయంగా ప్రేరేపిస్తున్నారు కనిపిస్తోంది అంటూ జగన్ వెల్లడించారు.. చంద్రబాబు తన వాళ్లతో చేయిస్తున్న ఈ దారుణాలతో రాష్ట్రంలో ఎవరికి కూడా రక్షణ లేకుండా పోయింది.
సర్పంచ్ నాగమల్లేశ్వరరావు ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీశామని తన అన్న వేణుప్రసాద్ తో మాట్లాడి వివరాలను కనుక్కున్న తర్వాత అక్కడ ఎమ్మెల్యే ప్రోత్సాహంతోనే కొంతమంది టిడిపి మొక్కలు ఇలాంటి దాడి చేశారని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ గ్రామంలో ఎక్కువగా అక్రమాలు జరుగుతున్నాయని వాటిని అడ్డుకున్నందుకే ఈ దాడికి పాల్పడ్డారని తన దృష్టికి వచ్చిందని మాజీ సీఎం జగన్ రాసుకొచ్చారు.