తెలంగాణ బిజెపిలో ముసలం పుట్టింది. బిజెపి ఎమ్మెల్యే అయినటువంటి రాజాసింగ్ బిజెపి పార్టీకి రాజీనామా చేస్తూ లేఖను అదిష్ఠానానికి పంపారు. అంతేకాదు బిజెపిలో ఉన్నటువంటి కొంతమంది పార్టీని రాష్ట్రంలో ఎదగనివ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన స్టేట్మెంట్స్ ఇచ్చారు. ముఖ్యంగా కిషన్ రెడ్డి, బండి సంజయ్ లపై విరుచుకుపడ్డారు. బిజెపి పార్టీ ఇప్పటికే అధికారంలోకి వచ్చేది. కానీ ఈ నాయకులు చేసిన తప్పుల వల్లే రావడం లేదని ఆయన చెప్తూ వస్తున్నారు. ఇప్పుడే కాదు రాజాసింగ్ గతంలో కూడా  ఇలాంటి కామెంట్స్ చేస్తూ వచ్చారు. చాలాసార్లు బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడుతూ అసలు విషయాలను బయటపెడుతూ వచ్చారు. అలాంటి రాజాసింగ్ రాజీనామా చేసిన తర్వాత బీజేపీ అధిష్టానం ఆయనను వెనక్కి పిలిచి మళ్లీ అడుగుతుంది కావచ్చు అనుకున్నాడు.

 కానీ ఇప్పటివరకు రాజాసింగ్ ని ఆ పార్టీ అధిష్టానం కనీసం పట్టించుకోవడం లేదనిపిస్తోంది. దీనికి కారణం రాజాసింగ్ ప్రవర్తనే అని అర్థమవుతోంది. మరి అలా ఎందుకు చేస్తుందో చూద్దామా.. ప్రస్తుతం తెలంగాణ బిజెపి చీఫ్ గా రామచందర్ రావు వచ్చారు. ఆయన ఇప్పటివరకు రాజాసింగ్ ఇష్యూపై కనీసం మాట్లాడలేదు. ఇప్పటికే పార్టీని నలుగురు నాలుగు గ్రూపులు చేశారు. ఎవరితో మాట్లాడాలో అర్థం కావడంలేదని రాజాసింగ్ బయటకు వచ్చేశారు. ఈ విధంగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ఏనాడు కూడా పార్టీ వైపు మాట్లాడింది అయితే లేదు. ఇదివరకు ఆయన గెలిచిన సమయంలో అసెంబ్లీలో అయినా సరే తన గొంతు వినిపించి ఉండాల్సింది. కానీ అలా చేయకుండా ఆయన తన గురించి తాను చెప్పుకోవడం బిజెపిని విమర్శించడం లాంటిదే చేశాడు.

ఈయన ఒక్కడే బిజెపిలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అసెంబ్లీలో ఎలాంటి విషయాలపై కూడా ఆయన మాట్లాడలేదు. అదే తరుణంలో నోముల నరసింహయ్య, ప్రస్తుత సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వంటి వాళ్ళు  అసెంబ్లీలో ఒక్కొక్కరే ఉన్నారు. కానీ ప్రజల తరఫున ఎన్నో అద్భుతమైన విషయాలను ప్రభుత్వం ముందు పెట్టారు. అలాంటి విషయాలను రాజాసింగ్ ప్రభుత్వం ముందు పెట్టి వారిని  ప్రశ్నించడంలో మాత్రం విఫలమయ్యాడు. ఆ తర్వాత ఎమ్మెల్యే అయినటువంటి  రఘునందన్ రావు ప్రభుత్వంపై అనేక విమర్శలు చేస్తూ, వారు చేస్తున్న తప్పులని ఎత్తి చూపాడు. ఈ విధంగా పార్టీలో ఉంటూ ఛాన్స్ ఉన్నా కానీ ఏనాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించనటువంటి రాజా సింగ్ ను బిజెపి పట్టించుకోవడం మానేసిందని చెప్పవచ్చు.

అయితే రాజాసింగ్ కు నేనే  పెద్ద లీడర్ ను అనే అపోహ ఉంటుంది.  ఇదే తరుణంలో తనకు తానే రాజీనామా చేయడంతో  కనీసం అధిష్టానం తనతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయడం లేదు.. దీన్నిబట్టి చూస్తే మాత్రం రాజాసింగ్ ను వాళ్ళు వదిలేయాలని డిసైడ్ అయినట్టుగా కనిపిస్తోంది. ఇదే క్రమంలో రాజాసింగ్ ఆయన శివసేన పార్టీలోకి వెళ్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే బిజెపి పార్టీకి రాజీనామా చేయడంతో పార్టీ ఆయనపై అనర్హత వేటు వేయబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. దాంతో మరో ఉప ఎన్నిక కూడా రాబోతున్నట్టు చాలామంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: