గత ఎన్నికల సమయంలో వైసీపీ నుంచి బయటకు వచ్చిజనసేనలో చేరిన‌ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి .. భవిష్యత్తు ఏంటా ? అనే సందేహాలు ఆయన అనుచరుల్లో గట్టిగా ఉన్నాయి .. జనసేనలో ఆయనకు సరైన గుర్తింపు లేదన్న అభిప్రాయాలు కూడా బయటకు వచ్చాయి .. అయితే ఇప్పుడు తాజాగా మార్కాపురం సభలో పవన్ కళ్యాణ్ స్వయంగా బాలినేని పేరు ప్రస్తావిస్తూ ఆయన తనకు ఎంతో ఆత్మీయుడు అని, రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని పొగటంతో బాలినేనికి పెద్ద బలంగా మారింది ..
 

ఇక ఇదే క్రమంలో పవన్ చెప్పిన కొన్ని వ్యాఖ్యలు కూటమి పార్టీల మధ్య ఉన్న వ్యత్యాసాలను సర్దుబాటు చేయాలని సంకేతాలుగా కూడా కనిపిస్తున్నాయి . అయితే ఇప్పుడు ఈ పరిణామాల క్రమంలో .. ఒంగోలు ప్రాంతంలో బాలినేని పరిధిలో టిడిపి అసహనం ఇప్పటికీ అలాగే కొనసాగుతుంది .. గత వైసిపి అధికారంలో ఉన్నప్పుడు టిడిపి నాయకులను బాలినేని ఎంతగానో ఇబ్బంది పెట్టారని వారు తమ బాధను బయటపెడుతున్నారు .. ఈ కారణంగానే ఆయనతో కలిసి తాము పని చేయలేమని వారు తేల్చి చెబుతున్నారు .. ముఖ్యంగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల తన స్పష్టమైన వ్యతిరేకతను ఇప్పటికే తెలియచెప్పారు .. ఇలాంటి పరిస్థితుల్లో కూటమిలో బాలినేని పాత్ర ఏమిటి అనేది ఇంకా క్వశ్చన్ గానే మారింది ..

 


అలాగే ఎమ్మెల్సీ పదవి వస్తుందన్న‌  ప్రచారం వినిపించిన .. ఇప్పటివరకు దానిపై ఎలాంటి అధికార ప్రకటన రాలేదు . అయితే ఇప్పుడు మొత్తానికి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో బాలినేనికి కొంత తాత్కాలిక  ఉపశమనం లభించింది .. అసలు రాజకీయంగా ప్రయోజనం కలగాలంటే కూటమి పార్టీల మధ్య పూర్తి సమన్వయం ఎంతో అవసరం .. నిన్న పవన్ చేసిన ఈ సూచనలు టిడిపి నాయకులు ఎంతవరకు పాటిస్తారా ? లేక తన రాజకీయ అనుభవంతో నిష్కల్మషమైన రాజకీయ నడ‌కతో బాలినేనే అందరిని ఒప్పించుకుంటారా ? అనేది మాత్రం ఇప్పుడు ఎంతో ఆసక్తిగా మారింది .

మరింత సమాచారం తెలుసుకోండి: