
కూటమి ప్రభుత్వంలో యువనేత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎదుటే మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తనదైన స్టైల్ లో సహచర మంత్రి నారాయణకు చురకలు అంటించారు. గతంలో వైసీపీలో ఉన్న ఆనం గత ఎన్నికలకు ముందు టిడిపిలోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. ఆ మాటకు వస్తే గత తెలుగుదేశం ప్రభుత్వంలో కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలోకి వచ్చి ఉక్క పోతకు గురయ్యారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ కండువా కప్పుకుని వెంకటగిరి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అక్కడ ఆయన మనస్తత్వానికి ఇమడ లేకపోయారు. గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం కండువా కప్పుకుని ఆత్మకూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఈసారి చంద్రబాబు ఆయన సీనియార్టి , సమర్ధత గుర్తించి మంత్రి పదవి కట్టబెట్టారు. ఇక్కడ ఎందుకో ఆనం ఉక్కపోత కు గురవుతున్నట్టుగా కనిపిస్తోంది. లోకేష్ సమక్షంలో మాట్లాడుతూ తను మధ్యతరగతి కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చానని .. మంత్రి నారాయణ పరిస్థితి అది కాదని చెప్పారు కార్పొరేట్ శక్తిగా ఎదిగిన తర్వాతే నారాయణ రాజకీయాల్లోకి వచ్చారని సెటైర్ వేశారు.
విద్యావ్యవస్థను నెల్లూరు జిల్లాలో కార్పోరేటీ కరించారని నారాయణను ఉద్దేశించి ఆనం అన్నారు. విద్యని కార్పొరేటికరించడం ద్వారా సొమ్ములు వెనకేసుకున్నారు అంటూ లోకేష్ సమక్షంలోనే పరోక్షంగా నారాయణను ఉద్దేశించి మంత్రి ఆనం వ్యాఖ్యలు చేశారన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అలాగే వెంకటగిరి రాజా పేరుతో స్థాపించిన వీఆర్ విద్యాలయాన్ని అలాగే ఉంచామని .. మీరు కూడా అలాగే చేయాలని మంత్రి నారాయణను కోరారు. మున్సిపల్ కార్పొరేషన్ అనే పదం యాడ్ చేయటం వల్ల వెంకటగిరి రాజావారిని అగౌరవపరిచినట్టు అవుతుందని ఆనం హెచ్చరించారు. ఎందుకో గాని ఈ సమావేశంలో మంత్రి నారాయణను టార్గెట్ చేస్తూ ఆనం కాస్త కఠినంగా మాట్లాడినట్టు అనిపించింది. విద్యను వ్యాపారం చేసుకునే కార్పొరేట్ శక్తిగా అవతరించావు.. పేదలకు ఉచిత విద్య అందించాలని .. అప్పుడు తాము కూడా మీ బాటలో నడుస్తామంటూ ఉచిత సలహా రూపంలో నారాయణను టార్గెట్ చేసినట్టుగా కనిపించింది. ఈ సభలో ఆనం అలా మాట్లాడకుండా ఉండాల్సింది అని టిడిపి వర్గాలు చెవులు కోరుక్కుంటున్నాయి. ఏది ఏమైనా ఆనం రామనారాయణ రెడ్డి ఏ పార్టీలో ఉన్నా ఉన్నది ఉన్నట్టు నిర్మొహమాటంగా ముక్కుసూటిగా మాట్లాడతారన్న అభిప్రాయాలు ఉన్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు