వైసీపీ హయాంలోనూ, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోనూ రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యలు , నిర్ణయాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి . వైసీపీ హయాంలో హైకోర్టు తీర్పులపై అప్పటి కార్యకర్తలు సోషల్ మీడియా లో తీవ్ర విమర్శలు చేశారు . న్యాయమూర్తుల ను , వారి తీర్పుల ను తప్పుబడుతూ కొందరు వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది . అలాగే , రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను హైకోర్టు తప్పుబట్టి , కొన్నింటిని రద్దు చేసింది . కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక , ఈ విషయం లో మార్పు వస్తుందని చాలా మంది భావించారు . న్యాయవ్యవస్థ , తీర్పుల పట్ల కూటమి జాగ్రత్తగా వ్యవహరిస్తుందని అంచనా వేశారు . కానీ, క్షేత్రస్థాయి లో జరుగుతున్న పరిణామాలు , అధికారుల నిర్లక్ష్యం కారణం గా కూటమి ప్రభుత్వం పైనా విమర్శలు వస్తున్నాయి .


 వైసిపి హయాం లో జరిగిన స్థాయి లో తీవ్రత లేనప్పటికీ , హైకోర్టు దృష్టి లో ప్రభుత్వం పై సానుకూలత కొరవడుతోంది .న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం , ఈ పరిస్థితి భవిష్యత్తు లో ప్రభుత్వాని కి ఇబ్బందికరం గా మారే అవకాశం ఉంది . ఇటీవల తిరుపతి లడ్డు కేసులో నిందితులకు బెయిల్ , సింగయ్య మృతి కేసులో వైసిపి నాయకుల పై విచారణకు స్టే వంటి నిర్ణయాల పై సోషల్ మీడియా లో విమర్శలు వచ్చాయి . హైకోర్టు ఈ విమర్శలను తీవ్రంగా తప్పుబట్టింది . కూటమిలోని సీనియర్ నాయకులు కూడా ఇది సరైన పద్ధతి కాదని అంటున్నారు . మరో కీలక అంశం, సోషల్ మీడియా వ్యాఖ్యల పై కేసులు పెట్టడాన్ని హైకోర్టు ఇటీవల తప్పుబట్టింది .


వైసిపి హయాం లో సోషల్ మీడియా స్వేచ్ఛను అణిచివేశారని టీడీపీ నాయకులు విమర్శించారు . కానీ, ఇప్పుడు కూడా సోషల్ మీడియా వ్యాఖ్యల పై కేసులు , జైలు శిక్షలు విధించడం హైకోర్టు దృష్టికి వచ్చింది . రాష్ట్రవ్యాప్తం గా మెజిస్ట్రేట్‌ల ను హైకోర్టు హెచ్చరించి , ఇలాంటి కేసుల్లో రిమాండ్ విధించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించింది . ఈ పరిణామాలు వైసిపి , కూటమి ప్రభుత్వాలు హైకోర్టు విషయం లో న్యాయపరమైన అంశాల్లో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి . లేకపోతే , భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులు , కూడా ఎదురవ్చవచ్చు .

మరింత సమాచారం తెలుసుకోండి: