
ఈ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. కొత్తచెరువు జడ్పీ పాఠశాలలోని పదవ తరగతి అదే విధంగా 8వ తరగతి విద్యార్థులకు చెందిన తరగతి గదులను పరిశీలించిన సీఎం చంద్రబాబు ..వాళ్లరో చాలాసేపు మాట్లాడారు . చదువు గురించి.. అదే విధంగా టీచర్స్ ఎలా చెబుతున్నారు అన్నదాని గురించి.. పిల్లలకు ఏం కావాలి అన్నదాని గురించి.. వివరంగా అడిగి తెలుసుకున్నారు . ఈ క్రమంలోనే విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డును పరిశీలించి కొత్త స్ఫూర్తిని నింపుతూ కౌన్సిలింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు .
అంతేకాదు మెరుగ్గా ఫలితాలు సాధించాలి అని సీఎం విద్యార్థులకు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. అనంతరం కాసేపు ఉపాధ్యాయుడిగా మారి సీఎం చంద్రబాబు సోషల్ సైన్స్ పాఠాలను విద్యార్థులకు బోధించారు. ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ఆయన సోషల్ సైన్స్ పాఠాలను బోధించారు . ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు చెప్పిన పాఠాన్ని ఒక విద్యార్ధిలా శ్రద్ధగా మంత్రి నారా లోకేష్ విన్నారు . దీనికి సంబంధించిన పిక్చర్స్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఆ పాఠశాలలోని విద్యార్థుల సైతం ఆసక్తిగా శ్రద్ధగా ఎంతో వినయంగా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పిన సోషల్ సైన్స్ పాఠాన్ని బాగా చక్కగా విన్నారు..!!