
పేర్ని నాని చేస్తున్న కామెంట్లను వింటే మీరు ఒకరికి ఇన్స్పిరేషన్ గా నిలవకుండా ఏమీ లేని ఆకులాగా ఉంటే ఎలా అని పేర్ని నాని వెల్లడించారు. మీరు మాట్లాడొచ్చని కేసు పెడితే అక్రమ కేసులు అంటారని అనిత పేర్కొన్నారు. ఉదయం 5 ట్యాబ్లేట్లు వేసుకునే వాళ్ళు కూడా చంద్రబాబు ఏజ్ గురించి మాట్లాడుతున్నారని అనిత పేర్కొన్నారు. నా మనస్సుకు చాలా బాధగా అనిపిస్తోందని అనిత వెల్లడించారు.
రాజశేఖర్ రెడ్డి గారు అలా చనిపోతారని ఎవరైనా అనుకున్నారా అని అనిత ప్రశ్నించారు. ఈ రాష్ట్రాన్ని మేము బాగు చేస్తామని ఆశగా ఎదురు చూస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు. మా పని మేము చేసుకుంటున్నామని అలా అని తప్పుడు మాటలు మాట్లాడితే మాత్రం ఉఉరుకునే ప్రసక్తి లేదని అనిత అన్నారు. ఏపీకి బ్రాండ్ ఇమేజ్ రాకూడదని శాంత్రి భద్రతలకు కలిగించేలా పేర్ని నాని మాట్లాడారని అనిత వెల్లడించారు.
ఒకానొక అధ్యక్షా అన్న వ్యక్తి నుంచి ఇలాంటి మాటలు చెప్పుకొచ్చారు. ఎవరైనా పేర్ని నాని చేసిన కామెంట్లను యాక్సెప్ట్ చేస్తారా అని ఆమె వెల్లడించారు. చంద్రబాబు నాయుడిలా నిలబడి 2 గంటలు ఎవరైనా మాట్లాడండని అనిత పేర్కొన్నారు. నాకు చాలా ఉక్రోషంగా ఉందని ఆమె అన్నారు. 15 సంవత్సరాలు సీఎంగా పని చేసిన వ్యక్తి గురించి మాట్లాడటానికి మీరెవరని ఆమె ప్రశ్నించారు. అనిత కామెంట్ల గురించి పేర్ని నాని రియాక్షన్ ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉంది.