రాజ‌కీయాల్లో ఎత్తులు-పై ఎత్తులు కామ‌న్‌. ప్ర‌త్య‌ర్థుల‌పై పైచేయి సాధించ‌డమే రాజ‌కీయ నేత‌ల‌కు ము ఖ్యం. ఈ విష‌యంలో అన్ని పార్టీల‌దీ ఒకేదారి. ఒక‌ప్పుడు అధికార పక్షం త‌మ‌పై క‌క్ష సాధింపు చ‌ర్య‌లకు దిగితే.. న్యాయ‌పోరాటాలు చేసే వారు. పార్టీ ప‌రంగా ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించేవారు. అస‌లు.. గ తంలో అంటే.. రెండు ద‌శాబ్దాల కింద‌టి వ‌ర‌కు.. ఈ త‌ర‌హా క‌క్ష‌పూరిత రాజ‌కీయాలు రెండు తెలుగు రాష్ట్రా ల్లోనూ(అప్ప‌ట్లో ఉమ్మ‌డి ఏపీ) లేవు. కానీ.. రాష్ట్రాలు విడిపోయాక‌.. క‌క్ష పూరిత రాజ‌కీయాలు పెరిగిపోయా యి.


వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు.. టీడీపీ నాయ‌కుల‌పై కేసులు పెట్టారు. జైళ్ల‌కు పంపించారు. ఏకంగా పార్టీ అధినేత చంద్ర‌బాబును సైతం 53 రోజుల పాటు జైల్లోనే ఉంచారు. క‌ట్ చేస్తే.. అది చంద్ర‌బాబుకు సాను భూతిని కురిపించింది. ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకునేలా చేసింది. ఇక‌, ఇప్పుడు వైసీపీ వంతు వ‌చ్చిం ది. ఆ పార్టీ హ‌యాంలో జ‌రిగిన మ‌ద్యం కుంభ‌కోణంపై ప్ర‌త్యేక ద‌ర్యాప్తుబృందంతో విచార‌ణ చేస్తున్న ప్ర‌భుత్వం.. ఇప్ప‌టికే కీల‌క నాయ‌కుల‌ను అరెస్టు చేసిజైలుకు త‌ర‌లించింది. ఇక‌, ఇప్పుడు అస‌లు సూత్ర‌ధారి అంటూ.. ఈ కేసులో జ‌గ‌న్ పేరును చెప్ప‌క‌నే చెప్పేసింది.


ఇప్పుడు మంద్యం కుంభ‌కోణంలో ఏదైనా అరెస్టు చేయాల్సి వ‌స్తే.. అది జ‌గ‌నే. అంతిమంగా ప్ర‌భుత్వ ల క్ష్యం కూడా అదే. టీడీపీ అధినేత చంద్ర‌బాబు అరెస్టును జీర్ణించుకోలేని ఆ పార్టీ నాయ‌కులు.. జ‌గ‌న్ అరె స్టును బ‌లంగా కోరుకుంటున్నారు. ఈ క్ర‌మంలో పూర్తి ఆధారాల‌తో త‌ప్పించుకోలేని విధంగా జ‌గ‌న్‌ను ఇరి కించాల‌న్న‌ది స‌ర్కారు ఆలోచ‌న‌. ఈ నేప‌థ్యంలోనే మ‌ద్యం కుంభ‌కోణం వ్య‌వ‌హారం తెర‌మీదికి వ‌చ్చింది. ఇది ఎంత వేగంగా చేస్తారా?  జ‌గ‌న్‌ను తిరిగి జైలుకు ఎప్పుడు పంపిస్తారా? అని కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు కూడ ఎదురు చూస్తున్నారు.


అయితే.. ఇక్క‌డే జ‌గ‌న్ మాస్ట‌ర్ ప్లాన్ వేశారు. త‌న‌ను అరెస్టు చేయ‌డం ఖాయ‌మ‌ని జ‌గ‌న్ కూడా మాన‌సికం గా సిద్ధ‌మ‌య్యారు. అయితే.. ఈ అరెస్టు.. సాధార‌ణంగా ఉండ‌కూడద‌ని.. దీని వ‌ల్ల త‌న‌కు ప్ల‌స్సు, అధికార పార్టీకి మైన‌స్సు కావాల‌న్న వ్యూహంతో జ‌గ‌న్ ఆలోచ‌న చేస్తున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబుకు చేరింది.  అంటే.. జ‌గ‌న్ ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌చ్చేస్తారు. అనుకున్న స‌మ‌యం కంటే కూడా.. ఆయ‌న ముందుగానే ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌చ్చి పాద‌యాత్ర చేస్తారు.


ఆ పాద‌యాత్ర‌లోనే పోలీసులు అరెస్టు చేసేలా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశం ఉంది. త‌ద్వారా.. ప్ర‌జ‌ల కోసం పోరాడుతున్న త‌న‌ను అరెస్టు చేశార‌న్న వాద‌న‌ను ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకువెళ్లే అవ‌కాశంపై రెండు రోజులుగా జ‌గ‌న్ చ‌ర్చిస్తున్నారు. ఈ విష‌యం చంద్ర‌బాబుకు కూడా తెలిసింది. ఇప్పుడు ఏం చేయాల‌న్న దానిపై ఆయ‌న అంత‌ర్మ‌థ‌నం చెందుతున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: