
స్మార్ట్ రైస్ కార్డు క్యూఆర్ కోడ్ సహాయంతో అనుబంధం అయ్యి ఉంటుందని.. ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఆగస్టు 25 నుంచి 31 వరకు ఈ రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుందని.. 65 ఏళ్లు నిండిన వృద్ధులకు రేషన్ డోర్ డెలివరీ ని చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి నెల ఒకటవ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ అందుబాటులో ఉంటుందంటూ తెలిపారు.కొన్ని జిల్లాలలో కొన్ని సమస్యలు ఉన్నాయని ఆ సమస్యల పరిష్కారం కోసం ఆ జిల్లాలకు వెళ్లి మరి పరిష్కారం చూసేలా చూస్తున్నామని తెలిపారు. దీపం పథకం కోసం Hppl,iocl కంపెనీలతో కూడా చర్చలు జరిపామని ఇప్పటివరకు 93 లక్షల 46 వేల మందికి ఈ దీపం పథకం కింద చేర్చామని తెలిపారు.
అయితే ఇలా కొత్త రేషన్ కార్డులు ఇస్తే ప్రాబ్లం లేదు.. కానీ పల్లెలలో రాజకీయాలలో వల్ల రేషన్ కార్డులను ఆపడం వంటివి చేస్తే మాత్రం ఖచ్చితంగా పెద్ద తలనొప్పి మొదలవుతుంది. మరి ఇలాంటి సంఘటనలు జరగకుండా అందరికీ కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసేలా కూటమి ప్రభుత్వం చేస్తుందేమో చూడాలి.