
కేజ్రీవాల్ సీఎంగా జైలులో ఉంటూనే ప్రభుత్వాన్ని నడిపారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జైలులో ఉండి ప్రభుత్వాన్ని నడిపే ముఖ్యమంత్రి దేశానికి అవసరమా అని ఆయన కామెంట్లు చేశారు. నైతికత ఎక్కడ ఉందంటూ ఆయన కామెంట్లు చేశారు. కేజ్రీవాల్ లిక్కర్ పాలసీ కుంభకోణంలో జైలుకు వెళ్లి అక్కడి నుంచి ప్రభుత్వాన్ని ఎలా నడిపారంటూ ఆయన ప్రశ్నించారు.
ఇలాంటి పరిస్థితులలో రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉందా లేదా అంటూ ఆయన ప్రశ్నించారు గతంలో ఢిల్లీని బీజేపీ పాలించిందని ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితులు లేవని ఆయన తెలిపారు. కేజ్రీవాల్ అరెస్ట్ అయిన వెంటనే పదవికి రాజీనామా చేసి ఉంటె ఈ తరహా బిల్లులను ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదని అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి.
ఇలాంటి రూల్ ను రాజ్యాంగం రూపొందించిన సమయంలోనే ఎందుకు పెట్టలేదని అమిత్ షా కామెంట్లు చేశారు. భవిష్యత్తులో జైలుకు వెళ్లే వ్యక్తులు ప్రజా ప్రతినిధులు అవుతారని ఆ సమయంలో ఎవరూ ఉహించి ఉండరని అమిత్ షా చెప్పుకొచ్చారు. అమిత్ షా చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు