
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఎంతవరకు ఉపయోగకరమైన పనులు చేసిందో పక్కన పెడితే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చిందా లేదా అనే విషయంపై స్పష్టంగా ఫోకస్ చేస్తోందని జనాలు అంటున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే "స్త్రీశక్తి పథకం" అమలు విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం రకరకాల మడతలు పెట్టిందనే అభిప్రాయం వినిపిస్తోంది. ఈ విషయంపై వైఎస్సార్ కాంగ్రెస్ గట్టిగానే పోరాడింది. "ఉచిత బస్సు" అంటే ఏపీలో ఉన్న అన్ని ఊర్లకు వర్తించాలి. కొన్ని ఊర్లకు ఉచితంగా తిప్పి మరికొన్ని ఊర్లకు వర్తించదు అంటే ఎలా..? ఇదే అంశాన్ని జగన్ పార్టీ బాగా హైలైట్ చేసింది. తిరుమల ఘాట్ రోడ్లలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించలేమని మొదట ఏపీ ప్రభుత్వం చేతులెత్తేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగి నిలదీయడంతో, చివరికి ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది.
మొత్తానికి ఉచిత ప్రయాణం ఘాట్ రోడ్లలోనూ వర్తిస్తుందని ప్రకటించింది. లేనిపక్షంలో మాన్యం ప్రాంతాల్లో ఉన్న లక్షలాది మహిళలను మోసం చేసినట్లవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాటల దాడి చేసింది. దీంతో తప్పకపట్టి ఏపీ ప్రభుత్వం ఘాట్ రోడ్లలో కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించింది. అయితే తిరుమల విషయంలో మాత్రం ఆ సౌకర్యాన్ని ముందుకు తీసుకురాలేకపోయింది. కానీ జగన్ పార్టీ మాత్రం వెనక్కి తగ్గకుండా పదేపదే కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. చివరికి ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ తిరుమలకు కూడా ఉచిత బస్సు అవకాశం కల్పించనున్నట్టు ప్రకటించారు. ఉచిత బస్సు పథకాన్ని చంద్రబాబు నాయుడు ప్రారంభించినా, తిరుమల ఘాట్ రోడ్లలో ఆ పథకం అమలుకు కారణం అయిన ఘనత మాత్రం జగన్‌కే దక్కింది. జగన్మోహన్ రెడ్డి సాగించిన ప్రజా పోరాట ఫలితమే ఈ పేదల సంతోషమని చాలామంది ప్రశంసిస్తున్నారు. దాంతో కొందరి దృష్టిలో జగన్ "దేవుడు"గా నిలిచిపోయాడు. మరికొందరు "సొమ్ము ఒక్కరిది సోకు మరోకరిది"అంటే ఇదే అని కామెంట్స్ చేస్తూ..కష్టం ఏమో చంద్ర బాబుది..క్రెడిట్ ఏమో జగంకా..? అంటూ మాట్లాడుకుంటున్నారు..!!