అనంతపురం జిల్లాలో గత వారం రోజుల నుంచి టిడిపి ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పై ఎన్టీఆర్ అభిమానులు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ని, ఆయన కుటుంబ సభ్యులను నానా మాటలు అంటూ ఒక ఆడియో సంచలనంగా మారడంతో టిడిపి ఎమ్మెల్యే పైన ఎన్టీఆర్ అభిమానులు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అందుకు సంబంధించి ఒక వీడియో రూపంలో  అనంతపురం ఎమ్మెల్యే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, నారా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతూ క్షమాపణలు చెప్పినప్పటికీ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి అంటూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు టిడిపి ఎమ్మెల్యే ఇంటిని కూడా చుట్టుముట్టారు.



ఇప్పుడు తాజాగా మళ్లీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఇంటిని చుట్టూ ముట్టడంతో పోలీసులు ముందస్తూ చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే నివాసానికి వచ్చే మార్గాల పరిసరాలలో కూడా బార్కెట్లు ఏర్పాటు చేసి భద్రతను కూడా కల్పించారు. అనంతపురం నగరంలో కి ఎన్టీఆర్ అభిమానులు వచ్చారని సమాచారం రావడంతోనే పోలీసులు చాలా అలర్ట్ అయినట్లుగా తెలుస్తోంది. అనంతపురంలో జరుగుతున్న ధర్నాకు వెళుతున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను కూడా పోలీసులు వేళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది.



అనంతపురంలోకి వెళ్లడానికి పర్మిషన్ లేదని చెప్పి పామిడి వద్ద జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను ఆపివేశారు. దీంతో అభిమానులు అక్కడే నిరసనను తెలియజేస్తూ ఉన్నారు. అలా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, పోలీసుల మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకున్నది. ఇప్పటికే ఎన్టీఆర్ అభిమానులకు సంబంధించి కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మరి ఈ విషయంపై ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి. ఈ విషయం పైన ఇప్పటికే పలువురు నేతలు కూడా దగ్గుబాటి ప్రసాద్ ని హెచ్చరించారు. ఇటీవలే సీఎం చంద్రబాబుతో పాటు నారా లోకేష్ దగ్గరికి వెళ్లిన ఈ టిడిపి ఎమ్మెల్యే అక్కడ పద్ధతి మార్చుకోవాలని సూచించినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: