
గూగుల్ ఇంటర్వ్యూలను ఆన్లైన్లో నిర్వహిస్తూ ఉంటే AI ని ఉపయోగించేసి ఇంటర్వ్యూ సక్సెస్ అవుతున్నవారు ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత అసలు విషయాలు బయటపడుతున్నాయని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలియజేశారు.. అందుకే ఈ విషయంలో తాము యూ టర్న్ తీసుకుంటున్నామని.. ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలను మాత్రమే ఇకమీదట నిర్వహిస్తామంటూ తెలియజేశారు. అందుకు సంబంధించి ప్రణాళికలను కూడా ప్రస్తుతం సిద్ధం చేస్తున్నామంటూ తెలియజేశారు గూగుల్ సీఈవో.
మంచి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులకు నిర్ధారించేందుకే కనీసం ఏదైనా ఒక్క ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుందట. AI ని ఉపయోగించుకొని చాలామంది అనర్హులు ఉద్యోగాలలో చేరుతున్నారని.. దీంతో గూగుల్ కంపెనీ యాజమాన్యానికి కూడా చాలా మంది వినతులు పంపించారట. ఇంటర్వ్యూలలో హాజరవుతున్న వారిలో 50 శాతం కంటే ఎక్కువమంది ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టూల్స్ ని ఉపయోగించి మోసం చేస్తున్నారని టెక్ నిపుణులకు ఒక నివేదిక చేరిందని తెలుస్తోంది. సుందర్ పిచాయ్ మాట్లాడుతూ.. హైబ్రిడ్ విధానంలో పని చేస్తున్నటువంటి సమయాలలో ఇలాంటి ఇంటర్వ్యూలలో కొంత భాగం వ్యక్తిగతంగా నిర్వహించాలనే ఆలోచన చాలా మంచిదిగా భావిస్తున్నామని తెలిపారు. అలాగే గూగుల్ సంస్కృతిని కూడా అభ్యర్థులు అర్థం చేసుకునేందుకు ఈ పద్ధతి చాలా ఉపయోగపడుతుందని తెలిపారు..ఈ సమస్య అంతా కూడా గూగుల్ ఒక్క సంస్థకే కాదని ఐటీ ,టెక్ పరిశ్రమ మొత్తానికి ఉండవచ్చు అంటు తెలిపారు.