వైసిపి అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికలలో ఘోర ఓటమిని చవిచూశారు. ఈ విషయం నుంచి తేలుకోక ముందే ఇటీవలే తన సొంత నియోజకవర్గమైన పులివెందల, ఒంటిమిట్ట ప్రాంతాలలో జడ్పిటిసి ఉప ఎన్నికలు జరగగా అందులో కూడా ఘోరంగా ఓడిపోయింది. అలా ఓడిపోయిన తరువాత మొదటిసారి పులివెందుల నియోజకవర్గానికి వచ్చారు జగన్. తండ్రి y.s రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కావడం చేత పులివెందులకు వచ్చారు.కానీ ఇక్కడ ప్రజలు తనని కలవాలి అంటే వీఐపీ పాసులు జారీ చేసినట్లుగా వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించి కొన్ని పాసులు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.



గతంలో కూడా తాను సీఎంగా ఉన్నప్పుడు పరదాల చాటున మాత్రమే తన సొంత ప్రాంతంలో కూడా పర్యటించారు జగన్. ఇప్పుడు మాజీ అయ్యాక కూడా అలాంటివి మార్చుకోలేకపోతున్నారు. తండ్రి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు పులివెందులకి వచ్చిన జగన్ తో కడప ఎంపీ అవినాష్ రెడ్డి, వైసిపి ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ రెడ్డి, అంజాద్ భాష, రవీంద్రనాథ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రామ సుబ్బారెడ్డి తదితర నేతలు కూడా జగన్ ని కలిశారు.


ఇటీవలే పులివెందులలో జడ్పిటిసి ఉప ఎన్నికలలో వైసిపి పార్టీ డిపాజిట్స్ కూడా కోల్పోవడంతో ఈ విషయంపై జగన్ చాలా అసంతృప్తితో ఉన్నట్లు తెలిసిందే.. ఇది జగన్ కి చాలా ఘోర అవమానంగా అన్నట్టుగా వినిపించాయి. అందుకే ఇటీవలే పులివెందులకు వచ్చిన జగన్ కేవలం కొంతమంది కార్యకర్తలను , మాజీ మంత్రను కలవడానికి మాత్రమే మక్కువ చూపారని అది కూడా పాసులు ఉన్న వ్యక్తులను మాత్రమే భద్రతా సిబ్బంది కూడా అనుమతించడంతో అక్కడి ప్రజలు, నేతలు చాలా విడ్డూరంగా చూస్తున్నారు..దీంతో అక్కడ కొంతమంది పలువురు సిబ్బందితో కూడా వాగ్వాదానికి దిగినట్లుగా వినిపిస్తున్నాయి..మాజీ సీఎం అయ్యుండి , పులివెందల ఎమ్మెల్యే అయ్యుండి కూడా తమ నేతను కలిసి తమ సమస్యలను చెప్పుకోవడానికి వస్తే ఇలా పాసులు ఉండాల్సిందే అంటూ తన అవమానిస్తారా అంటూ అభిమానులు కార్యకర్తలు మాట్లాడుతున్నారు. మరి ఈ పాస్ పద్ధతి ఇలాగే కొనసాగితే రాబోయే ఎన్నికలకు కూడా దెబ్బ పడుతుందని కార్యకర్తలు భావిస్తున్నారు.ఈ విషయం విన్న వారంతా కూడా జగన్ ఇలా అయితే ఎలా మీరు మారరా అంటూ హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: