
శ్రీకాకుళంలో జనాభాపరంగా సామాజిక వర్గాలపరంగా కూడా ఈ మూడు సరి సమానంగానే ఉండడంతో అవకాశాలు అలాగే దక్కించుకునేవారు ఎర్రన్నాయుడు, అచ్చెన్నాయుడు, కూన రవికుమార్, తమ్మినేని సీతారాం, వెంకట్రావు వంటి వారు టిడిపిలో ఎన్నో అవకాశాలు కూడా సంపాదించుకున్నారు. శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష పదవి కోసం టిడిపిలో ఇప్పుడు భారీగానే పోరు కొనసాగుతోంది. ఈ పదవి తమ సామాజిక వర్గానికి ఇవ్వాలి అంటు ప్రధాన కులాలు పట్టుబడుతున్నాయి.
వెలమల వారి విషయానికి వస్తే బాబాయ్ అచ్చెన్నాయుడు , అబ్బాయి రామ్మోహన్ నాయుడు కేంద్ర ,రాష్ట్ర మంత్రులుగా ఉండడంతో ఆ సామాజిక వర్గం వారికి కాకుండా తూర్పు కాపుల నుంచి లేదా కాళింగుల నుంచి చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. దీంతో ఈ రెండు వర్గాల వారు రేసులో ఉన్నారు. ఇందులో మరొక ట్విస్ట్ ఏమిటంటే.. కాళింగుల నుంచి ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ కి ప్రభుత్వ విప్ పదవి ఇచ్చారు కాబట్టి ఇది క్యాబినెట్ ర్యాంకుతో సమానం. అందువల్ల తూర్పు కాపులకు ఎలాంటి పదవి లేదు కాబట్టి వారిని జిల్లా ప్రెసిడెంట్ చేస్తే బాగుంటుందని అంటున్నారు.
అలా తూర్పు కాపులు vs కాళింగుల మధ్య పదవి కోసం తీవ్రమైన పోటీ కొనసాగుతోంది. మాజీ మంత్రి వెంకట్రావుని విజయనగరం జిల్లా చీపురాలకి పంపించిన తర్వాత శ్రీకాకుళం జిల్లాలో కాపులకు సరైన రాజకీయ ప్రాతినిథ్యం టిడిపి నుంచి లేదని అంటున్నారు. అందుకే తమకే అవకాశం ఇవ్వాలని కాపులు కూడా పట్టుబడుతున్నారు. త్రిముఖ కమిటీ ఇచ్చే రిపోర్ట్, ప్రజా ప్రతినిధులు ఇచ్చే సలహాల ద్వారానే పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షుడిని ఎంపిక చేస్తారని టిడిపి నేతలు తెలియజేస్తున్నారు. మరి ఆ పదవి ఎవరికి చేపడుతుందో చూడాలి.