
ఇటీవల దసరా వేడుకల సందర్భంగా తెలంగాణలో భారీ ఎత్తున మద్యం అమ్మకాలు జరిగాయి. రావాల్సి న దానికంటే కూడా.. 1500 కోట్ల రూపాయలు అదనంగా తెలంగాణ ప్రభుత్వానికి వచ్చింది. ఇదేసమయం లో ఏపీలో మాత్రం సాధారణ అమ్మకాలు కూడా సాగలేదని అధికారులు లెక్క తేల్చారు. పెద్ద పెద్ద బ్రాండ్ల విక్రయాలు ఎప్పుడూ నిలకడగానే ఉంటాయి. కానీ, సాధారణ, దిగువ మధ్యతరగతి వారు తాగే మద్యం బ్రాండ్ల విక్రయాలు పెరుగుతుంటాయి. కంపెనీలు కూడా వాటినే తయారు చేస్తాయి.
అంతేకాదు.. వీటిలోనే మార్జిన్ ఎక్కువగా కూడా ఉంటుంది. ఇది సర్కారుకు ఆదాయాన్ని తీసుకువస్తుం ది. అయితే.. పండుగల వేళ మద్యం కిక్కు ఇవ్వాల్సింది పోయి.. తగ్గుముఖం పట్టడంపై సర్కారు ఆలోచ నలో పడింది. దీనికి సంబంధించిన కారణాలపై ఆరా తీయగా.. నకిలీ మద్యం ప్రభావం ఎక్కువగాఉందని స్పష్టమైంది. వైసీపీ హయాంలో నకిలీ బ్రాండ్స్‌తాగి అనారోగ్యం పాలైన వారు.. మరణించిన వారు కూడా ఉన్నారు. దీంతో కూటమి సర్కారుపై నమ్మకం పెట్టుకున్నారు. చంద్రబాబు కూడా నాణ్యమైన మద్యాన్ని ఇస్తామన్నారు.
అయితే.. అనూహ్యంగా నకిలీ మద్యం వ్యవహారం తెరమీదికి రావడంతో ఈ ప్రభావం సేల్స్‌పై పడుతోంది. సామాన్య, దిగువ మధ్యతరగతి వారు కొనుగోలు చేసే బ్రాండ్లపై అనుమానాలు తలెత్తుతున్నాయని.. దీం తో కొనుగోళ్లు తగ్గుముఖం పట్టాయని అధికారులు చెబుతున్నారు. అంతేకాదు.. పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం రాష్ట్రంలోకిప్రవేశిస్తున్నట్టుగా కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నకిలీ మద్యం వ్యవహారంపై ఏదో ఒకటి తేల్చాలని కోరుతున్నారు. లేకపోతే..సేల్స్ పడిపోయే అవకాశం మరింత పెరుగుతుందన్న వాదనా వినిపిస్తోంది.