బీహార్ ఎన్నికలలో గెలవడానికి అటు ఎన్డీఏ, మహఘట్ బంధన్ కూటమి, జన్ సూరజ్ పార్టీలు సైతం ప్రచారంలో భాగంగా పోటాపోటీ గానే పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా ఓటర్లను ఆకర్షించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అగ్ర నేతలు. ముఖ్యంగా పార్టీలు  సైతం మ్యానిఫెస్టోలో కూడా ఒక పార్టీకి మించి మరొక పార్టీ హామీలు ఇచ్చారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఒక అరుదైన ఫిట్ చేశారు. అదేమిటంటే బీహార్ ఎన్నికలలో ప్రచారంలో భాగంగా బెగూసరాయ్ వెళ్లిన రాహుల్ గాంధీ స్థానికంగా ఉన్న మత్స్యకారులను కలవడం జరిగింది. అలాగే వారి కష్టాలను తెలుసుకొనే ప్రయత్నం కూడా చేశారు.


మహాఘట్ కూటమిలో మిత్రపక్షంగా ఉన్నటువంటి ముకేశ్ సాహ్నీ తో కలిసి చెరువులో దూకారు స్వయంగా చేపలు కూడా పట్టడంతో మత్స్యకారుల ఆనందానికి అవధులు లేకుండా ఉన్నట్టుగా ఒక వీడియో వైరల్ గా మారింది. ఓట్లు అడగడం కంటే వారి మద్దతు పొందేందుకే ఇలా ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. నడుము కంటే ఎక్కువ లోతు ఉన్న నీటిలో రాహుల్ గాంధీ చేపలు పడుతున్న విధానం చూసి మత్స్యకారుల షాక్ అయ్యారు.


మహాకూటమి ఈసారి ఎన్నికలలో మేనిఫెస్టోలో మత్స్యకారులకు వేట నిషేధం ఉన్న సమయంలో ప్రతి నెల రూ .5000 రూపాయలు చొప్పున ఇస్తామంటూ హామి ఇచ్చారు. అలాగే వారికి ఇన్సూరెన్స్ వంటి సహాయాన్ని కూడా అందిస్తామంటూ తెలియజేశారు. ఈ విషయం అక్కడ మత్స్యకారులలో మరింత ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ విషయానికి సంబంధించి రాహుల్ గాంధీ కూడా ఆసక్తికరమైన ట్విట్ చేస్తూ వారి సమస్యలను పోరాటాలను తెలియజేశారు. అలాగే బీహార్లో నదులు కాలువలు , చెరువులలో నివసించే మత్స్యకారులు ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో చాలా కీలకంగా ఉంటారని వారి హక్కులను, గౌరవం కాపాడడం కోసం ప్రతి అడుగులోను వారితో నిలబడతానంటూ తెలిపారు. అయితే ఈ విషయం పై అపోజిషన్ పార్టీ నేతలు ఇదంతా కూడా ఓట్ల కోసమే చేస్తున్నారంటూ ట్రోల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: