మైనింగ్ మాఫియా కింగ్ గాలి జనార్థన్ అంటే అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో, కర్ణాటకలో ఎన్నో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే వారు.  అక్రమ మైనింగ్ కేసులో ఆయన జైలు కూడా వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే.  కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో అక్రమ గనుల తవ్వకాలకు సంబంధించిన కేసులో మాజీ మంత్రి గాలి జనార్దన రెడ్డిపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)  చార్జ్‌షీటు దాఖలు చేసింది.

గురువారం బెంగళూరులోని ప్రజాప్రతినిధుల కోర్టులో చార్జ్‌షీట్‌ను సమర్పించింది. షేక్‌సాబ్ అనే వ్యక్తికి సంబంధించిన మైనింగ్ స్థలాన్ని కాంట్రాక్ట్ తీసుకున్న జనార్దన రెడ్డి అందులో అక్రమ తవ్వకాలకు పాల్పడినట్టు సిట్ ఆరోపించింది.
ఈ మేరకు బెంగళూరులోని లోకాయుక్త కోర్టుకు చార్జిషీట్ సమర్పించింది.  ఈ మేరకు బెంగళూరులోని లోకాయుక్త కోర్టుకు చార్జిషీట్ సమర్పించిం ది. ఇందులో గాలి జనార్దనరెడ్డిని ఏ1 నిందితుడిగా, అలీఖాన్‌ను ఏ2గా, శ్రీనివాసరెడ్డిని ఏ3 నిందితుడిగా పేర్కొంది. 

ఈ నేపథ్యంలో   యాంబిడెంట్ ముడుపుల కేసులో గాలి జనార్దన రెడ్డిని గత నెలలో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈడీ దాడుల నుంచి రక్షిస్తానంటూ ఓ వ్యాపారి నుంచి భారీగా లంచం తీసుకున్న కేసులో ‘గాలి’ని అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనను బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలుకు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: