ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా రాజకీయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఈ నియోజకవర్గం ఉత్తరాంధ్రలో చాలా కీలకంగా ఉంటుంది. జిల్లాలో గజపతివంశం, బొత్స కుటుంబం నుంచి ఎంతోమంది రాజకీయ ఉద్దండులు రాజకీయంగా ఎదిగారు. అలాంటి విజయనగరం గడ్డపై ఈసారి ఏ పార్టీకి అనుకూలంగా ఉండబోతోంది అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఈ జిల్లా ఓటర్లు రాజకీయ చతురత కలిగిన వారు. ఈ జిల్లా ప్రజలు ఏ పార్టీ వైపు సపోర్ట్ చేస్తే ఆ పార్టీ తప్పక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అలాంటి ఈ నియోజకవర్గంలో టిడిపి, వైసిపి మధ్య రసవత్తర పోరు నడుస్తోంది. 

గత ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయింది. జిల్లాలోని 9 నియోజకవర్గాలు వైసిపి కైవసం చేసుకుంది. ఇందులో ఆరు నియోజకవర్గాల్లో 20 వేలకు పైగా మెజారిటీ వచ్చింది. కానీ ఈసారి లెక్కలన్నీ మారాయట. ఈ నియోజకవర్గంలో టిడిపి పుంజుకుందని టిడిపి అధినాయకత్వం తెలియజేస్తోంది. వారికి పట్టు ఉన్నటువంటి నియోజకవర్గాల గురించి ఒక అంచనాకు కూడా వచ్చారట.  మరి ఆ నియోజకవర్గాలు ఏంటి అనే విషయంలోకి వెళ్తే.. టిడిపి ఇప్పటికే  చేసిన సర్వే ప్రకారంగా జిల్లాల వారిగా  ఉన్నటువంటి ప్లస్ లను, మైనస్ లను ఆయా నియోజకవర్గాల్లో వారి కార్యకర్తలకు, నాయకులకు తెలియజేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది విజయనగరం జిల్లా. ఈ జిల్లాలో భారీ మార్పు వచ్చిందట. గజపతినగరం, ఎస్ కోటాలో పోయిన వారం వరకు వైసిపికి సపోర్ట్ లభించిందట.

ఎచ్చర్ల కూడా వైసిపి స్ట్రాంగ్ ప్లేస్ నుంచి కాస్త తగ్గిపోయిందని టిడిపి అధినాయకత్వం అంచనా వేసిందట. కలిసేట్టి నియోజకవర్గంలో మెజారిటీ కనిపిస్తుంది ఒకవేళ క్రాస్ ఓటింగ్ లేకపోతే బిజెపి కూడా బయటపడవచ్చు అని తెలుస్తోంది. నెల్లిమర్ల కూడా కిన్ కాంటెస్ట్ లోకి వచ్చిందట. సాలూరు, చీపురుపల్లి తెలుగుదేశానికి రైట్ అప్ చేయవచ్చని అంటున్నారు. పార్వతీపురం కూడా కీన్ కాంటెస్ట్ లో ఉందట. అంతేకాకుండా విజయనగరం జిల్లా వరకు బొబ్బిలి, విజయనగరం, గజపతినగరం, ఎస్.కోట అలయన్స్ కు వస్తాయని,  సాలూరు, చీపురుపల్లి వైసీపీ ఖాతాలో పడతాయని,  మిగిలినవి కీన్ కంటెస్టులో ఉన్నాయని, టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది సర్వే చేసిన వ్యక్తులు అధినాయకత్వానికి లెక్కలు అందించారట. ఈ విధంగా వారం క్రితం ఉన్న లెక్కల కంటే ఈసారి టీడీపీ విజయనగరంలో పుంజుకుందని వారు లెక్కలు వేసినట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: