ప్రవర్తన అనేది చెట్టు అయితే, గుర్తింపు అనేది దాని నీడ లాంటిది..! దీని వివరణ ఏమిటంటే.. మన ప్రవర్తన అనేది ఎప్పుడూ చెట్టు అలాగే ఉండాలి. చెట్టు అనేది మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఎన్నో రాళ్ల దెబ్బలు తగిలినప్పటికీ, మనకు తీయటి ఫలాలను అందిస్తుంది. అంటే మన ప్రవర్తన కూడా చెట్టు యొక్క ప్రభావం లాగానే ఉండాలి. మనం ఒక్కటే బాగుపడితే సరిపోదు. మనతో పాటు ఇతరులు కూడా బాగుపడాలి. ఒక చెట్టు, మనిషికి ఏవిధంగా ఉపయోగపడుతుందో, మనిషి కూడా మరొక మనిషికి ఆ విధంగానే ఉపయోగపడాలి. అప్పుడే గుర్తింపు కూడా దాని నీడలా వెంటాడుతూనే ఉంటుంది. అని దీని అర్థం.