దీపావళి పండుగ అంటేనే కమ్ముకున్న అమావాస్య కారు చీకట్లను దీపాల వెలుగులతో పారద్రోలే దీపావళి పండుగ అని చెప్పుకుంటూ ఉంటారు.. సమాజాన్ని పట్టి పీడిస్తున్న నరకాసురుడిని, శ్రీ మహాలక్ష్మి దేవి వధించి లోకానికి మంచి చేకూర్చింది కాబట్టి అప్పటి వరకు చీకట్లో కూరుకుపోయిన జనాలు దీపాలు వెలిగించి పండుగ చేసుకున్నారు.. అందుకే దీపావళి పండుగకు అంత ప్రాముఖ్యత సంతరించుకుంది.. అయితే ఇంతటి గొప్ప దీపావళి జరుపుకోవడానికి ప్రతి ఒక్కరు సంవత్సరం పొడవునా ఎదురుచూస్తూ ఉంటారు.. ఇకపోతే ఈ దీపావళి పండుగ జరుపుకునేటప్పుడు కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలి..


దీపావళి పండుగ రోజున మనం తీసుకోవలసిన జాగ్రత్తలు విషయానికి వస్తే.. ప్రతి ఒక్కరు ఈ టపాసులను రాత్రి సమయంలోనే ఎక్కువగా పేలుస్తుంటారు కాబట్టి ముఖ్యంగా ఎవరి జాగ్రత్త వాళ్లు తీసుకోవడం ఎంతో అవసరం.. కొంతమంది మాకు ధైర్యం ఎక్కువ అని టపాసులను చేతిలో పెట్టి మరీ కాలుస్తూ ఉంటారు.. ఇలా చేయడం ప్రమాదకరం.. కనీసం రెండు అడుగుల దూరం పాటించి మీరు టపాసులను పేల్చవచ్చు. ఇకపోతే చిన్నపిల్లలు ఈ క్రాకర్స్ కాల్చేటప్పుడు పెద్దలు జాగ్రత్త వహించాలి.


చిన్నపిల్లలు కాల్చే  టపాసులు తక్కువ మందు కలిగిన టపాసులను మాత్రమే కాల్చడానికి వారికి అనుమతి నివ్వాలి. లేకపోతే ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉండవచ్చు. అతి ముఖ్యమైన విషయం వేసుకునే దుస్తులు. పటాసులు కాల్చేటప్పుడు కేవలం కాటన్ వస్త్రాలు మాత్రమే ధరించాలి.. నూలు వస్త్రాలను , సిల్కు వస్త్రాలను ధరించకూడదు. ఇక అంతే కాదు మీరు పటాసులు వేసే సమయంలో పక్కన నీళ్లు లేదా ఇసుక వంటివి తప్పనిసరిగా పెట్టుకోవాలి.. ప్రమాదవశాత్తు జరగరానిది ఏదైనా జరిగినప్పుడు మీకు దగ్గరలో ఉండే ఈ నీళ్లు లేదా ఇసుక తప్పకుండా ఉపయోగపడతాయి..


ఇక టపాసులు కూడా ఎక్కువ కాకుండా తక్కువ బడ్జెట్లో కేవలం కొన్ని మాత్రమే పేల్చడానికి ప్రయత్నం చేయండి.. పర్యావరణ పరిరక్షణ కూడా దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి పర్యావరణానికి హాని కలిగించేలా టపాసులు  పేల్చకూడదు. కాబట్టి ఈ జాగ్రత్తలు పాటిస్తూ ఈ దీపావళిని ఎంతో అద్భుతంగా, ఘనంగా, ఉత్సాహంగా, సంతోషంగా జరుపుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: