హిందువుల ప్రధాన దేవుళ్లలో శివుడు కూడా ఒకరు. సంస్కృతంలో శివ అనగా సౌమ్యం, శుభం అని అర్థాలు ఉన్నాయి. పురాణాలు శివుడికి అభిషేకం చేస్తే దైవానుగ్రహాన్ని, పరిపూర్ణ జ్ఞానాన్ని పొందవచ్చని చెబుతున్నాయి. శివుడు అభిషేక ప్రియుడు. శివుడికి అభిషేకం చేయించడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. శివునికి అభిషేకం చేయిస్తే కోరుకున్న కోరికలు నెరవేరటంతో పాటు దైవానుగ్రహం లభిస్తుంది. 
 
ప్రభుత్వ అధికారుల నుండి సానుకూల ఫలితాలు పొందాలనుకునేవారు పసుపు పొడితో శివునికి అభిషేకం చేయిస్తే మంచిది. శివుని అనుగ్రహం లభించాలంటే తిరుమంజనపొడితో అభిషేకం చేయిస్తే మంచిది. ఉదర సంబంధిత రుగ్మతలతో బాధ పడేవారు శివునికి చందనాది తైలంతో అభిషేకం చేయిస్తే ఆ సమస్యలు తొలగిపోతాయి. బియ్యం పిండితో అభిషేకం చేయిస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి. 
 
శివునికి నెయ్యితో అభిషేకం చేయించిన వారికి మోక్షం సిద్ధిస్తుంది. శివునికి పంచామృతంతో అభిషేకం చేయిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. శివునికి పెరుగుతో అభిషేకం చేయిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. శివునికి బత్తాయి పండ్ల రసంతో అభిషేకం చేయిస్తే అనారోగ్యాలు మాయమవడంతో పాటు ఆరోగ్యం సిద్ధిస్తుంది. కొబ్బరినీటితో శివునికి అభిషేకం చేయిస్తే హోదా, గౌరవం, కీర్తి, ఉన్నత పదవులు దక్కుతాయి. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: