ఇక ఇతర రాష్ట్రాల ప్రజలు అయితే గుడి పడవ, ఇతర పేర్లతో ఈ పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. క్రైస్తవులు ఎంతో ప్రధానంగా జరుపుకొనే గుడ్ ఫ్రైడే ఇప్పటికే పూర్తి కాగా, ఈస్టర్ కూడా ఈ మాసంలో వస్తాయి. ఈ సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో ఏయే తేదీల్లో ఏయే పండుగలు వచ్చాయి.. ఏయే రోజుల్లో వచ్చాయనే వివరాలను ఓ సారి చూద్దాం. ఈ సంవత్సరం ఏప్రిల్ మాసంలో రెండు విశిష్ట ఏకాదశులు వచ్చాయి. వాటిలో ఒకటి 7 వ తేదీ వస్తుండగా, మరొకటి ఏప్రిల్ 23వ తేదీన రానున్నాయి. ఈ పవిత్ర మైన రోజుల్లో హిందువులు శ్రీ మహా విష్ణువును భక్ల్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ ముఖ్యమైన పర్వ దినములలో హిందువులు ఉపవాసాలు ఉంటారు. ఈ సారి ఏప్రిల్ 13వ తేదీ ఉగాది పండగ వచ్చింది. ఈరోజున దేశ వ్యాప్తంగా కొత్త సంవత్సర వేడుకలను జరుపుకుంటారు.
ఈ పండుగకు ఇతర రాష్ట్రాలలో కూడా ఎంతో ప్రత్యేకత కలిగి ఉన్నది. కానీ పశ్చిమ బెంగాల్ ప్రజలు మాత్రం ఏప్రిల్ 15వ తేదీన గౌరీపూజ పేరిట వేడుకలను జరుపుకుంటారు. ఈ రోజున వీరు శివపార్వతులను పూజిస్తారు. అంతే కాకుండా ఈ నెల 21 వ తేదీన శ్రీరామనవమి రానుంది. ఈరోజున శ్రీరాముని జన్మదినాన్ని ప్రత్యేకంగా జరుపుకుంటారు. 27వ తేదీన హనుమాన్ జయంతి, ఏప్రిల్ 30వ తేదీ వికట సంకష్ట చతుర్థి ఈ పర్వదినాన ఉపవాసం ఉండి వినాయకునికి ప్రత్యేక పూజలు చేసి చంద్రుడి దసరా తర్వాత ఉపవాసం విరమిస్తారు. ఇలా ఎన్ని పండుగలు ఈ మాసంలో ఉన్నందున ఏప్రిల్ నెల ఎంతో ప్రత్యేకమైనదిగా చెప్పబడింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి