ప్రతి నెలా దుర్గాష్టమి పండుగ  వస్తుంది

దుర్గాష్టమి పండుగ కేవలం నవరాత్రులలోనే కాదు, ప్రతి నెలా వస్తుంది. అవును ఇది నిజం. సహజంగా మనం ఇంగ్లీష్ క్యాలండర్ తో ముందుకు సాగుతుంటాం. ఆయా తేదులను బట్టి పుట్టి రోజులు, పెండ్లి రోజులు జరుపుకుంటుంటాం. ఫంక్షన్ లనూ అలాగే గుర్తు పెట్టుకుంటుంటాం. పాత రోజుల్లో అలా కాదు. తిథి, వార, నక్షత్రాలను పట్టి కార్యకమాలు చేసేవారు. అది పుట్టిన రోజు అయినా, పెండ్లి రోజు అయినా. ఈ కోవలోటివే జయంతులూ, వర్థంతులూ. ఇప్పటికీ భారత దేశంలోని గ్రామాలలో, పట్టణాలు, నగరాలలో కొన్ని చోట్ల తిథుల ప్రకారం కార్యక్రమాలు జరుగుతుండడం కద్దు. పరిశీలిస్తే ఇవి మనకు కనిపిస్తాయి. కాలం మారింది. కాలానుగుణంగా మనుషులూ మారారు. ఆచార అలవాట్లూ మారాయి. పరుగుతు తీసే ప్రపంచంలో ఇది తప్పని సరి అయింది కూడా.
హిందూ పంచాంగం ( ఇది ఓ రకమైన క్యాలండర్ ) ప్రకారం నెలకు ముప్పై రోజులు. సూర్య చంద్రుల గమనాగమనాలను బట్టి సూర్య మాసం (నెల), చంద్ర మాసం గా వ్యవహరిస్తారు. శుక్ల పక్షం, బహుళ పక్షం అని రెండు విభాగాలు ప్రతి మాసంలో ఉంటాయి. చంద్రుడు చిన్నగా ఆరంభమై క్రమంగా వృద్ధి చెందుతూ పౌర్ణమి వరకు ఉండే కాలాన్ని శుక్ల పుక్షంగా వ్యవహరిస్తారు. పౌర్ణమి నుంచి చంద్రుడు క్రమంగా క్షీణిస్తూ వెల్లడాన్ని బహుళ పక్షం అంటారు. శుక్ల పక్ష అష్టమి తిథి వచ్చిన రోజును దుర్గాష్టమి గా వ్యవహరిస్తారు. అదే విధంగా బహుళ చతుర్థశిని మాస శివరాత్రిగా వ్యవహరిస్తూ పరమేశ్వరుడికి పూజలు చేస్తారు.

ఇతి హాసం ప్రకారం దుర్గాష్టమికి సంబంధించి ఆసక్తి కరమైన కథనం జనబాహుళ్యంలో ఉంది. సృష్టికి మూలం ఆది పారా శక్తి, ఆమే త్రిమూర్తులై బ్రహ్మ, విష్టు, మహేశ్వరులను సృష్టించింది. యావత్ జీవరాశికి సృష్టి కర్తగా బహ్మ, .. సంరక్షకుడిగా శ్రీ మహా విష్ణువు, సంహారకుడిగా పరమేశ్వరుడు తమ విధులు నిర్వహిస్తుంటారు. మహిషాషురుడు అనే రాక్షసుడ్ని ఆదిపరాశక్తి దుర్గామాత రూపంలో సంహరించి రోజు ను పురస్కరించుకుని దుర్గాష్టమిని జరుపుకుంటారు హిందువులు. తెలుగు పంచాగం ప్రకారం ఆశ్వయుజ మాసం ప్రారంభం నుంచి తొమ్మది రోజులు పాటు జరిగే నవరాత్రులను దుర్గా నవరాత్రులుగా వ్యవహరిస్తారు. ఈ రోజుల్లో దేవుళ్లను కాకుండా దేవతలకు పూజలు చేస్తారు. దుష్టుడైన మహిషాసురుడ్ని వధించి నెల ఆశ్వయుజ మాసం కావండంతో ఆశ్వయుజ మాసం శుక్లపక్ష అష్టమి రోజును వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీ.

మహిళలకు ప్రీతి కరమైన మాసం కూడా కావడంతో ఈ నెల   అమ్మ దేవతల మాసం గా కూడా వ్యవహరిస్తారు కొన్ని ప్రాంతాలలో.  వివిధ ప్రాంతాలలో దుర్గా నవరాత్రులను వివిధ రకాలుగా జరుపుకుంటారు. ఉత్తర భారత దేశంలో మహిళలు దాండియా ఉత్సవం నిర్వహిస్తారు. తెలంగాణలో  బుతకమ్మగా కొలుస్తారు. పూలతో శ్రద్దగా జరిపే పండుగ  ఇది.
పసుపులో పుట్టిన గౌరమ్మ
పసుపులో పెరిగన గౌరమ్మ
పసుపులో వసంత మాడేవా ! అంటూ మహిళలు గానం చేస్తారు.
విజయవాడ లో కొలువై యున్న కనకదుర్గమ్మ,  వరంగల్ భద్రకాళి ఆలయం వేముల వాడ రాజన్న ఆలయాల్లో, తలుపులు లేని సూళూరు పేట చెంగాళమ్మ ఆలయంలో జరిగే ఉత్సవాలు మాటలకందవు. తిరుమల వేంకటేశ్వర స్వామికి కూడా నవరాత్రుల లోనే సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.


మరింత సమాచారం తెలుసుకోండి: