హిందూ ధర్మ శాస్త్రంలో హైందవ జీవన విధానంలో పూజలు,గృహాల్లో దీపాలకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. దీపాలు కొండెక్కగానే దీపాల లోకానికి చేరుకొని ఇంటి ఇల్లాలు గురించి ఆమె భక్తి, ఔధార్యం, వినయం, సంస్కారం గురించి ఆ లోకంలో చర్చించుకుంటాయని మరలా దీపారాధన సమయానికి ఇంటి ఇల్లాలు ఆహ్వానం కోసం ఎదురుచూస్తూ ఉంటాయని అనుకుంటారు. ఏ ఇంటి దీపాలు సమయానికి గృహానికి ఆహ్వానించబడతాయో ఆ ఇంటి దీపాలు ఆ లోకంలో అంత గౌరవించబడతాయి.

 దీపారాధన చేయకుండా ఎప్పుడూ కానీ ఆహ్వానించని దీపాలు ఆ లోకంలో తోటి దీపాల ముందు మన ఇంటికి దీపాలు అయినందుకు అవి బాధపడతాయి. దీపాలను కొద్ది నూనెలో వెలిగించి నూనె అయిపోగానే కొండెక్కాయని అనుకుంటారు. కానీ దీపానికి ఒత్తి కొనలో గూడు కడుతుంది కదా, ఆ గూడు నలపకూడదు. ఎందుకంటే నూనె అయిపోయిన దీపం, జ్యోతి అందులోనే ఉంటుంది. ఆ ఇంటి యజమాని,పిల్లలు క్షేమంగా రావాలని, జాగ్రత్తగా ఇల్లు చేరాలని దీపం భగవంతుడిని ప్రార్ధిస్తూ ఉంటుంది. ఆ ఇంటి యజమాని వచ్చే వరకు ఆ ఇంటి ఇల్లాలు కు తోడుగా ఉండి క్షేమం కోసం ప్రార్థిస్తూ అందులోనే ఉంటుంది. అందుకే దీపం కొండెక్కగానే ఒత్తికి ఉన్న నల్లగూడును నలపరాదు.
దీపం వెలుగు మెదడుకు ఏకాగ్రతను కలిగిస్తుంది. దీపంలోని ఒక్కో భాగం ఒక్కో దేవతా స్వరూపం. దీపం అడుగు భాగంలో బ్రహ్మ, మధ్యభాగంలో విష్ణువు, ప్రమిదలో శివుడు,వెలుగులో సరస్వతీదేవి, నిప్పు కనికలలో లక్ష్మీదేవి ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే పూజలో భాగంగా దీపానికి నమస్కారం చేస్తారు.


వంటింట్లో ఏ మూలలో దీపాన్ని వెలిగించాలో తెలుసుకుందాం. వంటింటి ఆగ్నేయ మూలలో దీపాన్ని వెలిగించాలి. ఈ ఆగ్నేయ మూలలో తప్పలు చేస్తే ఇంట్లో అన్ని అనర్థాలే కలుగుతాయి. అందుకే మీ స్టవ్ పక్కన ఆగ్నేయ మూలలో చిన్న ముగ్గు వేసి ఉదయం ఏ నూనెతో అయినా దీపం పెట్టండి.మరియు ఆ దీపానికి మీకు తోచిన నైవేద్యం పెట్టండి. ప్రతిరోజు ఈ ఆగ్నేయమూల లో దీపం పెడితే సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ తులతూగుతూ ఉంటుంది. అలాగే లక్ష్మీ అనుగ్రహం కూడా కలిగి, మంచి సంపన్నులు అవుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: