కుల, మత , జాతి,  వర్గ వంటి తారతమ్యం భేదభావాలు లేకుండా అందరూ సంతోషంగా తమ మనస్సులలో కి ఆనందాన్ని ఆహ్వానిస్తారు ఈ పండుగతో.. అందుకే హోలీ పండుగ కోసం సంవత్సరం పొడువునా ఎంతోమంది ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు అని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అలాంటి హోలీ పండుగ ఈ రోజు రానే వచ్చింది. ఇకపోతే ఈ హోలీ పండుగను హోలికా దహన్ అని కూడా పిలుస్తుంటారు. ఇక ఈ హోళికా దహన్ సందర్భంగా భోగిమంటలు వెలిగించడం ద్వారా భగవంతుడిపై భక్త ప్రహల్లాదుడికి ఎంత గొప్ప విశ్వాసం వుందో.. ఆ విషయాన్ని తెలియజేయడానికి ప్రజలు ఇలా జరుపుకోవడం జరుగుతుంది.

ఫాల్గుణ మాసం పౌర్ణమి నాడు ఈ పండుగను జరుపుకుంటారు . అంటే మార్చి 17 2022న హోళికా దహన్ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. ఇకపోతే హోలిక దహన్ యొక్క శుభ సమయం పూజా విధానం ఎలాగో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ఈ హోలిక దహన్ యొక్క శుభ ఘడియలు ఈ రోజు  రాత్రి 09:16  నుంచి  10: 16 నిమిషాల వరకు పూజలు ప్రారంభించబడతాయి. ఇక ఈ గంట  సమయంలో దిష్టిబొమ్మను వెలిగించి పవిత్రమైన అగ్ని చుట్టూ ప్రదక్షణ చేసి మానవజాతి యొక్క శ్రేయస్సు,  ఆనందంకోసం ప్రార్థించి దిష్టిబొమ్మను మంటలలో వేస్తారు. ఆ తర్వాత మరుసటి రోజు అనగా శుక్రవారం 18  2022న రంగుల వాలి హోలీ జరుపుకుంటారు.

ఈ హోళికా దహనం ఎందుకు జరుపుకుంటారు అంటే.. ప్రజలు.. భక్త ప్రహ్లాదుడు భగవంతుడిపై విశ్వాసం నుంచి అతని తండ్రి హిరణ్యకశ్యపుడు అలాగే అతని అత్త హోలికా యొక్క దురుద్దేశాలను నాశనం చేసి వారిపై జయిస్తాడు. హిరణ్యకశ్యపుడు తన కుమారుడైన భక్త ప్రహ్లాదుని చంపాలి అనుకొంటాడు.. కానీ ప్రహ్లాదుడు మాత్రం శ్రీహరి నామం జపిస్తూ ఉంటాడు. తండ్రి కొడుకును చంపలేక అతడు తన సోదరి హోలికను ప్రహ్లాదుడిని చంపమని కోరతాడు. ఇక హోలిక అగ్ని నుండి ఆమెను రక్షించుకోవడానికి ఒక శాలువా కప్పుకుని. భోగి మంటలలో  కూర్చొని ప్రహ్లాదుడిని భోగి మంటలలో కూర్చోమని ఆహ్వానిస్తుంది . కానీ అక్కడ శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమై.. హోలికా కప్పుకున్న శాలువా ప్రహ్లాదుడిని కప్పి హోలికను మంటలకు గురిచేస్తారు. ఆ విధంగా శ్రీ మహావిష్ణువు ప్రహ్లాదుడిని రక్షిస్తాడు. ఇక హోలిక మంటలో కాల్చి వేయబడుతుంది. అందుకే ఈరోజున దిష్టిబొమ్మను దగ్నం చేయడం జరుగుతుంది.

పూజా సామాగ్రి  కోసం..ఒక గిన్నెలో నీళ్లు , ఆవు పేడతో చేసిన దండ, కుంకుమ,  అక్షితలు , అగర్బత్తీలు, దూపం, పూలు , పసుపు కొమ్ము, పూర్ణం పప్పు, బాద్షా ,గులాల్  పొడి ,కొబ్బరి ,కొత్త ధాన్యమైన గోధుమలను తీసుకొని.. ఇక వీటన్నింటినీ ఒక ప్లేట్లో ఉంచాలి. హోలిక పూజ చేయవలసిన స్థలాన్ని శుభ్రం చేసి ఉత్తరం లేదా తూర్పు ముఖంగా కూర్చోవాలి. ఇప్పుడు ఆవుపేడతో హోలిక అలాగే ప్రహ్లాదుడి విగ్రహాలను తయారు చేయాలి. ఇక ప్లేట్లో సిద్ధంగా ఉంచుకున్న అన్ని వస్తువులను హోలిక పూజలో సమర్పించాలి. స్వీట్లు, పండ్లు సమర్పించి నరసింహ స్వామిని పూజించాలి. చివరిగా హోలిక కు ఏడు సార్లు ప్రదక్షణ చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: