ఇక ఇప్పుడు మరో సారి ఆకాష్ చోప్రా మహేంద్ర సింగ్ ధోనీపై తన అక్కసు వెళ్లగక్కాడు. ఐసీసీ డికెట్ అవార్డ్స్ ప్రకటిస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల దశాబ్దాల్లో ఐసిసి టి20 జట్టును ప్రకటించింది. ఈ క్రమంలోనే మహేంద్ర సింగ్ ధోనీకి అరుదైన గౌరవం ఇచ్చింది. వికెట్ కీపర్ గా నే కాకుండా కెప్టెన్ గా కూడా చోటు వచ్చింది ఐసీసీ. దీంతో ధోనీ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి. ధోని కి ఇంత గౌరవం ఇచ్చిన ఐసీసీ కి కృతజ్ఞతలు తెలిపారు అభిమానులు.
అయితే దీనిపై ఆకాష్ చోప్రా మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశాడు. ధోని ఈ దశాబ్దంలో టీ-20లో చేసింది ఏమీ లేదని విమర్శలకు దిగాడు ఆకాశ్ చోప్రా. ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ కి ధోని కి ఇచ్చిన స్థానం కల్పించి ఉంటే బాగుండేది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయితే ప్రస్తుతం ఆకాష్ చోప్రా వ్యాఖ్యలపై ధోని అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియావేదికగా ఆకాశ్ చోప్రా ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే వాస్తవంగా అయితే ధోని పై ఆకాశ్ చోప్రా ఇలా నోరు జారితూ విమర్శలు చేస్తూ ఉండడం తరచూ జరుగుతూ ఉంటుంది అనే విషయం తెలిసిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి