చివరికి చేసేదేమీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను నిరవధికంగా వాయిదా వేసింది బిసిసీఐ. ఇక ఆ తర్వాత బీసీసీఐ మిగిలి ఉన్న మ్యాచ్ లు నిర్వహించడానికి ప్లాన్ చేసింది. అయితే ఈసారి ఇండియాలో కాకుండా యూఏఈ వేదికగా బిసిసిఐ మిగతా మ్యాచ్లు నిర్వహించాలని సిద్ధం అయ్యింది. దీనికి సంబంధించిన షెడ్యూలు కూడా ప్రకటించింది. చివరకు అంతా బాగానే ఉన్నప్పటికీ అటు కొన్ని జట్లకు మాత్రం రెండవ దశ ఐపీఎల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఐపీఎల్ లో ఉన్న వివిధ జట్ల లో పలువురు విదేశీ ఆటగాళ్లు కీలక ఆటగాళ్లు గా కొనసాగుతున్నారు.
ఇప్పుడు ఐపీఎల్ రెండో దశ షెడ్యూల్ లో కొంత మంది విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్ కు దూరం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఐపీఎల్లో కరేబియన్ క్రికెటర్లకు ఎంత గుర్తింపు ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే అరేబియన్ క్రికెటర్లు ఆడతారా లేదా అన్న దానిపై గత కొన్ని రోజుల నుంచి అనుమానాలు నెలకొన్నాయి. కానీ ఇటీవలే వెస్టిండీస్ క్రికెటర్ లకు మార్గం సుగమం అయిందని తెలుస్తుంది. బీసీసీఐ విజ్ఞప్తి మేరకు కరేబియన్ ప్రీమియర్ లీగ్ షెడ్యూల్ ను ముందుకు జరిపేందుకు వెస్టిండీస్ బోర్డు అంగీకరించిందట. దీంతో ఇక ఐపీఎల్ లో వెస్టిండీస్ స్టార్ క్రికెటర్లు మరోసారి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి