కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ఇక ప్రేక్షకులకు స్టేడియంలోకి నో ఎంట్రీ అయిపోయింది. ఈ క్రమంలోనే ఇక ప్రేక్షకులు లేకుండానే అన్ని రకాల మ్యాచ్ లు జరిగిపోతున్నాయి. అయితే ఇక ఎప్పుడెప్పుడు స్టేడియం లోకి ఎంట్రీ ఉంటుందా ప్రత్యక్షంగా మ్యాచ్ లు చూస్తామా అని అటు క్రికెట్ లవర్స్ అందరూ వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. కాగా మరికొన్ని రోజుల్లో అటు ప్రేక్షకుల కోరిక తీరబోతుంది అన్నది అర్ధమవుతుంది. ఆగస్టు 4వ తేదీ భారత్ ఇంగ్లాండ్ మధ్య టెస్టు సిరీస్ నుంచి జరగబోతుంది. ఈ టెస్ట్ సిరీస్ కి 50% ప్రేక్షకులను అనుమతించే అవకాశం ఉంది అని గత కొన్ని రోజుల నుంచి టాక్ వినిపిస్తుంది.
కానీ 50 శాతం కాదు వంద శాతం ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్కు స్టేడియం మొత్తం పూర్తిగా ప్రేక్షకులతో నిండిపోయే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇటీవలే యూకేలో లాక్డౌన్ నిబంధనలు ఎత్తివేస్తూ ప్రధాని బోరిస్ జాన్సన్ నిర్ణయం తీసుకున్నారు. జూలై 19 నుంచి అన్ని నిబంధనలు ఎత్తి వేస్తారు. ఈ క్రమంలోనే ఇక 100% ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇది అటు ప్రేక్షకులందరికీ గొప్ప శుభవార్త అని చెప్పాలి. కాగా ప్రస్తుతం 20 రోజులు బ్రేక్ లో ఉన్న టీమిండియా జులై 14 నుంచి ప్రాక్టీస్ మొదలు పెట్టనుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి