ఇక ఇటీవల జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్లో అద్భుతంగా రాణించి ఏకంగా 39 ఏళ్ళ రికార్డులు బద్దలు కొట్టాడు. జట్టులో జస్ప్రీత్ బుమ్రా లాంటి దిగ్గజ బౌలర్ ఉన్నప్పటికీ మహమ్మద్ సిరాజ్ రికార్డును బద్దలు కొట్టి అందరి చూపు ఆకర్షించడం గమనార్హం. ఇక లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ లో కలిపి ఏకంగా ఎనిమిది వికెట్లు తీశాడు తొలి ఇన్నింగ్స్లో కీలకమైన నాలుగు వికెట్లు తీసి అదరగొట్టిన మహమ్మద్ సిరాజ్.. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అదే జోరును కొనసాగించాడు. రెండో ఇన్నింగ్స్ లో మరోసారి నాలుగు వికెట్లు తీశాడు. లార్డ్స్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఒక ఇండియన్ బౌలర్ ఇలా ఎక్కువ వికెట్లు తీయడం ఇది రెండవ సారి మాత్రమే కావడం గమనార్హం.
39 ఏళ్ల తర్వాత ఇక ఈ రికార్డును మహమ్మద్ సిరాజ్ బద్దలు కొట్టాడు. ఇంతకుముందు 1982లో కపిల్ దేవ్ ఈ ఘనత సాధించాడు. 1982లో లార్డ్స్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు రెండో ఇన్నింగ్స్లో మూడు వికెట్లు తీసి అరుదైన రికార్డు సాధించాడు కపిల్ దేవ్. ఇక ఇప్పుడు సిరాజ్ కూడా ఇదే రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే అప్పుడు కపిల్ దేవ్ కీలకమైన వికెట్లు పడగొట్టినప్పటికీ టీమిండియా మాత్రం ఓటమి చవిచూసింది. ఇక ఇప్పుడు మాత్రం టీమిండియా ఘనవిజయం సాధించడం గమనార్హం. ఇదిలా ఉంటే 2014లో లార్డ్స్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ రెండు ఇన్నింగ్స్ లలో ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టాడు. కానీ మొదటి ఇన్నింగ్స్ లో మాత్రం ఒక్క వికెట్ కూడా పడకుండా పేలవ ప్రదర్శన చేశాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి