ఐపీఎల్ అంటే ప్రపంచంలో తెలియని క్రికెట్ ప్రేమికుడు లేరు అనే చెప్పాలి. బీసీసీఐ 2008 లో తీసుకు వచ్చిన ఈ లీగ్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరును తీసుకువచ్చింది. ఈ లీగ్ వలన ముఖ్యంగా దేశవాళీ స్థాయిలో టాలెంట్ ఉన్నా మరుగున పడిపోయిన ఎందరో యువ క్రికెటర్లను ప్రపంచ దృష్టికి తీసుకువచ్చింది. అందుకే ఐపీఎల్ లో ఆడే జట్లలో చోటు సంపాదించుకోవడం కోసం యువకులు అందరూ దేశవాళీ స్థాయిలో జరిగే ప్రతి ఒక్క టోర్నీలో రాణిస్తూ ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిలో పడుతున్నారు. ఇప్పటి వరకు ఐపీఎల్ లో 14 సీజన్ లు ఎంతో సక్సెస్ ఫుల్ గా పూర్తి అయ్యాయి. వచ్చే సంవత్సరం ఐపీఎల్ 15 వ సీజన్ కు తెరలేవనుంది. దీని కోసం ఐపీఎల్ పాలకమండలి కసరత్తులు స్టార్ట్ చేసింది.

ఇందులో భాగంగా అన్ని ఫ్రాంచైజీలకు గత కొన్ని సంవత్సరాలుగా జట్లతో కొనసాగుతున్న ఆటగాళ్లను ఉంచుకోవడం లేదా జట్టు నుండి వదిలేయడం అనే ప్రక్రియలో ఉన్నారు. దీని కోసం బీసీసీఐ నవంబర్ 30 వరకు సమయాన్ని ఇచ్చింది. ఇంకా కేవలం 3 రోజులే ఉండడంతో ప్లేయర్ల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి సతమతమవుతున్నాయి. కొన్ని ఫ్రాంచైజీలు మాత్రం తాము ఉంచుకునే ప్లేయర్స్ విషయంలో క్లారిటీతో ఉండగా కొన్ని ఫ్రాంచైజీలు ఎటూ తేల్చుకోలేక సందిగ్ధంలో ఉన్నారు. అయితే ఇలాగే సమయం వృధా చేస్తూ పోతే ఆఖరి తేదీ దాటి పోతుంది. కాబట్టి ఆయా ఫ్రాంచైజీలు తమతో ఉంచుకునే 4 ఆటగాళ్ల లిస్ట్ ను ఇవ్వాల్సి ఉంది.

ఈ 4 ప్లేయర్స్ లో 3 స్వదేశీ ప్లేయర్స్ మరియు 1 విదేశీ ప్లేయర్ ఉండొచ్చని నిబంధన ఉంది. ఎంతో కాలంగా జట్టుతో పాటు ఉన్న అనుభవం కలిగిన ప్లేయర్స్ విషయంలో కఠినమైన నిర్ణయం తీసుకునే సమయం ఇది చెప్పాలి. మరో వైపు ప్లేయర్స్ కూడా ఎంతో ఉత్కంఠ క్షణాలను అనుభవిస్తున్నారు. ప్రతి ఒక్క ఫ్రాంచైజీలతో ఉంచుకునే ౪ ప్లేయర్స్ లో మాపేరు ఉంటుందా ఉండదా అనే విషయమై ఆలోచిస్తూ ఉన్నారు. వీటన్నిటికీ సమాధానం తెలియాలంటే ఇంకో 3 రోజుల పాటు వేచి చూడాల్సిందే...

మరింత సమాచారం తెలుసుకోండి: