మొన్నటివరకు టీమిండియాలో కీలక ఆటగాడిగా స్టార్ ఓపెనర్ గా కొనసాగిన రోహిత్ శర్మకు ఇటీవల కాలంలో వరుసగా ప్రమోషన్స్ వస్తు ఉన్నాయన్న విషయం తెలిసిందే. టీమ్ ఇండియా టి20 కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవడంతో  భారత్ టి20 కొత్త కెప్టెన్ రోహిత్ శర్మను నియమిస్తూ బిసిసిఐ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమ్ ఇండియా ఆడిన మొదటి టి20 సిరీస్ లోనే టీమిండియా అద్భుత విజయాన్ని సాధించింది అని చెప్పాలి. ఇక ఆ తర్వాత మరో పరిమిత ఓవర్ల ఫార్మాట్ అయిన వన్డేఫార్మర్ కి కూడా రోహిత్ శర్మకు కెప్టెన్సీ అప్పగిస్తారు అని అందరూ భావించారు.


 దీనిపై ఎన్నో రోజుల పాటు చర్చ కూడా జరిగింది. అయితే ఇక ఇటీవల టీ-20 జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ను వన్డే కెప్టెన్ గా కూడా నియమిస్తూ బిసిసిఐ ప్రకటన చేసింది.ఇది కాస్తా సంచలనంగా మారిపోయింది. టి20 కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవడం కారణంగానే ఇక వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తప్పించాలని వచ్చింది అంటూ బిసిసిఐ ఒక వివరణ కూడా ఇచ్చింది. అయితే తనను వన్డే కెప్టెన్ గా నియమించడం పైలట్ రోహిత్ శర్మ మాత్రం ఇప్పటి వరకు ఎక్కడా స్పందించలేదు. ఇటీవలే కెప్టెన్సీ దక్కడంపై స్పందించిన రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 టీమ్ ఇండియా జట్టుకు కెప్టెన్గా వ్యవహరించడం అనేది ఎంతో ఒత్తిడిని కలిగించే అంశం అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. సాధారణంగానే భారత జట్టుకు ఆడేటప్పుడు ఒత్తిడి ఉంటుంది. ఇక కెప్టెన్ గా వ్యవహరించడం అంటే అది చిన్న విషయం కాదు అంటూ రోహిత్ శర్మ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఒక ప్లేయర్ గా నాకు మాత్రం ఆట మీద దృష్టి సారించడమే ముఖ్యం.. బయట వాళ్ళు మాట్లాడుకునే విషయాలు గురించి నేను ఆలోచించను అంటూ రోహిత్ శర్మ తెలిపాడు. ఇక కోచ్గా రాహుల్ ద్రవిడ్ తనకు పూర్తి సహకారం అందిస్తున్నాడు అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: