భారత జట్టుకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇటీవలే భారీ అంచనాల మధ్య సౌత్ ఆఫ్రికా పర్యటనకు బయలుదేరిన భారత జట్టు ఎట్టి పరిస్థితుల్లో సౌత్ ఆఫ్రికా గడ్డపై మొదటిసారి టెస్ట్ సిరీస్ విజయం సాధించి చిరకాల కోరిక నెరవేర్చు కోవాలి అని అనుకుంది. ఈ క్రమంలోనే టీమిండియా అన్ని విభాగాల్లో కూడా పటిష్టంగా కనిపించడంతో ఈ సారి సౌతాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ విజయం సాధించాలని కల నెరవేరినట్లే అని అనుకున్నారు ప్రేక్షకులు. కానీ సౌత్ ఆఫ్రికా పర్యటనలో భాగంగా  టెస్టు సిరీస్లో టీమిండియా నిరాశపరిచింది. మొదటి టెస్ట్ మ్యాచ్లో విజయం సాధించి శుభారంభం చేసిన టీమిండియా ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్లలో మాత్రం ఓటమి చవిచూసింది.



 దీంతో ఇక సౌత్ ఆఫ్రికా జట్టుకు సిరీస్ అప్పజెప్పాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.  సౌత్ ఆఫ్రికా లో టీమిండియా టెస్టు సిరీస్ గెలుస్తుంది అనుకున్న సమయంలో ఓడిపోవడంతో అందరూ నిరాశలో మునిగిపోయారు. అయితే ఇక ఇలా నిరాశలో ఉన్న టీమిండియా కు మరో ఎదురు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ఎందుకంటే మొన్నటి వరకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో ఏకంగా టాప్ లో మొదటి  స్థానంలో కొనసాగిన టీమిండియా ఇక ఇప్పుడు మూడవ స్థానానికి పడిపోయింది. మూడవ స్థానంలో ఉన్న న్యూజిలాండ్ కాస్త రెండవ స్థానానికి వచ్చి చేరింది.


 అయితే టీమ్ ఇండియా ఇలా మూడోస్థానానికి రావడానికి కారణం సౌత్ ఆఫ్రికా లో జరిగిన టెస్టు సిరీస్ అన్నది అర్ధమవుతుంది. సౌత్ ఆఫ్రికా లో జరిగిన సిరీస్లో ఓటమి కారణంగానే వరల్డ్ ఛాంపియన్షిప్ ర్యాంకింగ్స్ లో భారత జట్టు 116 పాయింట్లతో టాప్ ప్లేస్ నుంచి మూడో స్థానానికి దిగజారిపోయింది. అయితే ఇటీవల యాషెస్ సిరీస్లో అద్భుతంగా రాణించిన ఆస్ట్రేలియా జట్టు 119 పాయింట్లతో టాప్ ప్లేస్లో కొనసాగుతుండడం గమనార్హం. ఇక న్యూజిలాండ్ జట్టు 117 పాయింట్లతో సెకండ్ ప్లేస్ లో కొనసాగుతోంది. ఇక టీమిండియా తర్వాత నాలుగవ స్థానంలో ఇంగ్లాండ్ ఐదవ స్థానంలో సౌత్ ఆఫ్రికా ఆరవ స్థానంలో పాకిస్థాన్ ఆ తర్వాత స్థానాల్లో శ్రీలంక,వెస్టిండీస్, బంగ్లాదేశ్, జింబాబ్వే  జట్లు కొనసాగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: