దీంతో ఇక ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో బెంగళూరు వేదికగా జరగబోయే మెగా వేలంలో ఎంతోమంది స్టార్ ఆటగాళ్లు పాల్గొంటున్నారు. అయితే ఇక ఈ సారి ప్రతిభగల ఆటగాళ్ళను జట్టులోకి తీసుకుని టైటిల్ కొట్టాలని ప్రతి ఒక్క జట్టు ప్లాన్ చేస్తుంది. అదే సమయంలో ఐపీఎల్ లో కొత్తగా ఇస్తున్న రెండు జట్లు ఇక రావడం రావడమే టైటిల్ ఎగరేసుకు పోవాలని ప్రణాళికను సిద్ధం చేసుకున్నాయ్. అయితే ఇటీవలే ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇస్తున్న అహ్మదాబాద్ కు అహ్మదాబాద్ టైటాన్ అనే పేరును ఖరారు చేశారు.
కానీ ఇప్పుడు మాత్రం ఆ పేరులో మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. అహ్మదాబాద్ టైటాన్స్ అనే పేరును గుజరాత్ టైటాన్స్ అని మార్చడం గమనార్హం. ఇక ఈ విషయాన్ని ఫ్రాంచైజీ యాజమాన్యం అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించింది. అయితే ఏడాది ఐపీఎల్ లోకి అడుగుపెట్టిన ఆ సంస్థ 5625 కోట్లకు గుజరాత్ ను సొంతం చేసుకుంది అనే విషయం తెలిసిందే. అంతేకాదు ఇక ఈ జట్టుకు కెప్టెన్గా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాను ఎంపిక చేసింది. దీనికోసం అతనికి 15 కోట్ల రూపాయలు చెల్లించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రషీద్ ఖాన్ ను కూడా అహ్మదాబాద్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. మెగా వేలం తర్వాత దీనిపై పూర్తి స్థాయి క్లారిటీ రాబోతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి