మొదట టాస్ గెలిచిన సఫారీలు ఇంగ్లాండ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించారు. అలా మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ మహిళలు నిర్ణీత ఓవర్ లలో 9 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ మహిళల్లో బీమౌంట్ మరియు జోన్స్ లు అర్థ సెంచరీలు సాధించడంతో కనీసం ఆ స్కోర్ అయినా చేయగలిగింది. ఇంగ్లాండ్ బ్యాటర్ లను ముప్పతిప్పలు పెట్టిన సఫారీ బౌలర్ మరిజన్ కప్ ఏకంగా 5 వికెట్లు తీసింది. అయితే ఇక్కడే ఇంగ్లాండ్ ఓటమి ఖరారు అయింది అని చెప్పాలి. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ లో ఎంత స్ట్రాంగ్ గా ఉందో ఇది వరకు జరిగిన మ్యాచ్ లలో చూశాము.
అందుకు తగినట్లుగానే ఈ మ్యాచ్ లో వల్వర్ట్ 77 పరుగులతో రాణించడంతో సౌత్ ఆఫ్రికా మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే మూడు వికెట్ల తేడాతో డిపెండింగ్ ఛాంపియన్ ను మట్టి కురిపించింది. ఈ విజయంతో సౌత్ ఆఫ్రికా ఆడిన మూడు మ్యాచ్ లలో మూడు గెలిచి పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో నిలిచింది. ఇక డిపెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన ఇంగ్లాండ్ వరుస ఓటములతో హ్యాట్రిక్ చేసింది. కాగా ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆఖరి నుండి రెండవ స్థానంలో నిలిచింది. అయితే ఇదే ఆటతీరును కనుక ముందు మ్యాచ్ లలో కనబరిస్తే ఇంగ్లాండ్ సెమీస్ చేరడం కష్టమే. మరి ముందు మ్యాచ్ లలో అయినా పుంజుకుంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి