2022 ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు వరకు ఐదు మ్యాచ్ లు ఆడిన ముంబై ఇండియన్స్ జట్టు వరుసగా ఐదు భాషల్లో కూడా ఓటమి చవిచూసింది. ఒకవైపు బ్యాటింగ్ విభాగం ఎంతో పటిష్టంగా కనిపిస్తున్నప్పటికీ బౌలింగ్ విభాగంలో బూమ్రా మినహా ఎవరూ కూడా పెద్దగా రాణించలేదు. వెరసి రోజురోజుకు ముంబై ప్రస్థానం దీనంగా మారిపోతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇటీవలే బెంగుళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో కూడా 12 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఓటమిని చవిచూసింది. దీంతో ఇక ముంబై ఇండియన్స్ అభిమానులందరూ కూడా నిరాశ లో మునిగిపోయారు.



 కానీ రోహిత్ శర్మ అభిమానులు మాత్రం ఆనందంలో గంతులేస్తూ ఉన్నారు. అదేంటి బాసు ముంబై ఇండియన్స్ ఓడిపోతే రోహిత్ శర్మ అభిమానులు ఆనందంతో ఊగిపోవటం ఏంటి.. అలా ఎందుకు చేస్తారు అని అనుకుంటున్నారు కదా. ఇలా రోహిత్ శర్మ అభిమానులు ఆనందంగా ఉండడానికి ఒక కారణం ఉంది. అదే రోహిత్ శర్మ సాధించిన రికార్డు. ఇటీవలే ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ లో భాగంగా రోహిత్ శర్మ ఒక అరుదైన మైలురాయిని అందుకున్నాడు. టి20 కెరియర్ లో 10 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో రబడా వేసిన మూడవ బంతిని సిక్సర్ గా మలచిన రోహిత్ శర్మ టి20లో 10000 పరుగులు పూర్తి చేసుకున్నాడు.


 ఇక ఇలా టీ-20 ఫార్మాట్ లో ప్రపంచ క్రికెట్లో 10000 పరుగులు పూర్తి చేసుకున్న 7వ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. భారత క్రికెట్లో టీ20ల్లో 10,000 పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండవ స్థానంలో ఉన్నాడు. ఇప్పటి వరకు కేవలం ఒక విరాట్ కోహ్లీ మాత్రమే 10000 పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఇక ఇటీవల జరిగిన మ్యాచ్ లో 500 ఫోర్లు కొట్టిన ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించాడు రోహిత్ శర్మ. దీంతో ముంబై ఓడింది అన్న నిరాశ ఉన్నప్పటికీ  రోహిత్ అరుదైన రికార్డులు సాధించాడు అన్న ఆనందం మాత్రం హిట్ మాన్ అభిమానుల్లో నిండిపోయింది. అందుకే ఆనందంలో గంతులు వేస్తున్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: