ఇండియాలో క్రికెట్ కి ఎంత ప్రత్యేకమైన స్థానం ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. భారత్ లో ఎన్నో రకాల ఆటలు ఉన్నప్పటికీ అటు క్రికెట్ మాత్రం కేవలం ఒక ఆట మాత్రమే కాదు అది ఒక మతం అన్నట్లుగా మారిపోయింది. దాదాపు ఇండియాలో ఉన్న కోట్ల మంది ప్రేక్షకులు  క్రికెట్ ను ఎంతగానో ఆదరిస్తూ ఉంటారు. జాతీయ క్రీడ హాకీ కంటే క్రికెట్ కే ఎక్కువ గుర్తింపు వచ్చింది. అయితే మొన్నటి వరకు భారత క్రికెట్ లో కేవలం పురుషులకు మాత్రమే ఎక్కువ ప్రేక్షకాదరణ ఉండేది.  ఇటీవలి కాలంలో మాత్రం బిసిసిఐ చొరవతో అటు మహిళా క్రికెట్ కి కూడా ఎంతగానో గుర్తింపు వస్తుంది.


 ప్రపంచ క్రికెట్లో భారత మహిళా క్రికెటర్లు కూడా అద్భుతంగా రాణిస్తూ రికార్డులు కొల్లగొడుతున్న నేపథ్యంలో ఇక ఎంతో మంది ప్రేక్షకులు మహిళా క్రికెట్ మ్యాచ్ లను చూసేందుకు కూడా సిద్ధమైపోతున్నారు. అయితే ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా బిసి ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తూ ఉంటుంది. అదే సమయంలో అటు మహిళలకు కూడా ఉమేన్స్ టి 20 చాలెంజ్ నిర్వహించేందుకు బిసిసిఐ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే కరోనా వైరస్ కారణంగా గత రెండేళ్ల నుంచి ఈ టోర్నీ జరగలేదు. కానీ ఈ ఏడాది మాత్రం వైరస్ ప్రభావం తగ్గడంతో ఇక మహిళల టీ-20 ఛాలెంజింగ్ నిర్వహించడానికి సిద్ధమైంది బీసీసీఐ.


 ఇక ఇందులో భాగంగా మూడు జట్లు తలపడుతున్నాయి అన్న చెప్పాలి. కాగా ఈ టి20 లీగ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లో స్మృతి మందాన నేతృత్వంలోని ట్రైల్ బ్లేజర్స్, హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని సూపర్ నోవాస్ జట్లు తలపడుతున్నాయి. పూణేలోని ఎంసీఏ స్టేడియం వేదికగా 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది..ఇక 23, 24, 25 తేదీలలో నాకౌట్ మ్యాచ్లు 28వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది అనేది తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇక ఈ మ్యాచ్లను కూడా వీక్షించి అటు మహిళా క్రికెట్ కు మరింత ఆదరణ అందించేందుకు క్రికెట్ ప్రేక్షకులందరూ సిద్ధమైపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl