ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా బాగా హైలెట్ ఆయన బౌలర్ ఎవరు అంటే టక్కున చెప్పేస్తారు ఉమ్రాన్ మాలిక్ అని.  హైదరాబాద్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న యువ బౌలర్ తన స్పీడ్ బౌలింగ్ తో అద్భుతాన్ని సృష్టించాడు. చివరకు ఏ సీనియర్ బౌలర్ కు సాధ్యం కాని రీతిలో ఏకంగా గంటకు 157 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసి ప్రపంచ క్రికెట్ ప్రేక్షకుల చూపును తన వైపుకు తిప్పుకున్నాడు. ప్రతి మ్యాచ్లో  కూడా 150 కిలోమీటర్ల వేగం తగ్గకుండా బంతులు విసిరితు సత్తా చాటాడు అనే చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ఈ ఐపీఎల్ ఏకంగా ఇరవై రెండు వికెట్లు తీసిన ఆటగాడిగా కూడా కొనసాగుతున్నాడు ఉమ్రాన్ మాలిక్. ఇతని ప్రదర్శనపై ఇప్పటివరకు దాదాపు మాజీ క్రికెటర్లు అందరు కూడా ప్రశంసలు కురిపించారు అని చెప్పాలి. ఇమ్రాన్ మాలిక్ బుల్లెట్ లాంటి బంతులు విసురుతూ ఉంటే మహా మహా బ్యాట్స్మెన్లు సైతం బెంబేలెత్తిపోయారు. రాకాసి బౌన్సర్ లతో ఎక్కడ గాయాలు అవుతాయో అని ఎంతో ఆచితూచి బ్యాటింగ్ చేశారు అని చెప్పాలి. కాగా ఇటీవలే పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ఉమ్రాన్ మాలిక్ మయాంక్ అగర్వాల్ పై రివేంజ్ తీర్చుకున్నాడు. వేగంగా విసిరిన బంతి విసరగా మయాంక్ అగర్వాల్ పక్కటెముకలకు తగలడంతో ఇక రన్ కోసం ప్రయత్నించి మరో ఎండ్ లో  ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఫిజియో గ్రౌండ్ లోకి వచ్చాడు. ఐదు నిమిషాలకు పైగా ఎంతో ఇబ్బంది పడి పోయాడు మయాంక్ అగర్వాల్. ఆ సమయంలో రిటైర్డ్ హర్ట్ గా  వస్తాడని అందరూ భావించిన నొప్పితో నే  బ్యాటింగ్ చేశాడు. నాలుగు బంతులు ఆడిన మయాంక్ అగర్వాల్ కేవలం ఒకే ఒక పరుగు చేసి అవుటయ్యాడు. రివెంజ్ ఎందుకు అనుకుంటున్నారు కదా.. సన్రైజర్స్ ఇన్నింగ్స్ సమయంలో చివరలో బ్యాటింగ్ చేసేందుకు వచ్చాడు ఉమ్రాన్ మాలిక్.  మైదానంలో వస్తున్న సమయంలో బౌండరీ వద్ద పెళ్లి ఫీల్డింగ్ చేస్తున్న  మయాంక్ అగర్వాల్ అతని వెక్కిరించాడు.  చివరికి బంతి అతని చేతిలోకి రాగానే ఉమ్రాన్ మాలిక్ రివేంజ్ తీర్చుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl