ఎందుకంటే గత కొంత కాలంగా టి20 ఫార్మాట్ లో అనూహ్యమైన ప్రదర్శన చేస్తూ వరుస విజయాలతో దూసుకుపోతూ వస్తుంది టీమిండియా. రోహిత్ శర్మ కెప్టెన్సీ చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకూ 12 టీ20 మ్యాచ్ లు ఆడగా ఒక్క మ్యాచ్లో కూడా ఓడలేదు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు 12 మ్యాచ్లలో విజయం సాధించి అత్యధిక విజయాలు సాధించిన జట్ల లిస్టు లోకి వచ్చేసింది. ఈ క్రమంలోనే మరో విజయం సాధించింది అంటే చాలు ప్రపంచ రికార్డును కొల్లగొడుతుంది టీమిండియా.
కాగా టీమ్ ఇండియా జట్టు దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ తప్పకుండా గెలిచి తీరుతుంది అని అభిమానులు అందరూ కూడా బలంగా నమ్ముతున్నారు అని చెప్పాలి. అయితే జూన్ 9 నుంచి ఐదు టి20 మ్యాచ్ ల సిరీస్ ప్రారంభం కానుండగా తొలి మ్యాచ్ ఢిల్లీ వేదికగా జరగబోతుంది. ఈ మ్యాచ్లో టీమిండియా విజయం సాధిస్తే టీ20 లలో వరుసగా అత్యధిక మ్యాచులు గెలిచిన జట్టుగా రికార్డ్ సృష్టించబోతోంది. ఇక ఇప్పటి వరకు 12 టి20 మ్యాచ్ లు వరుసగా గెలిచి ఆఫ్ఘనిస్తాన్ రోమేనియా తో సమానంగా కొనసాగుతుంది అని చెప్పాలి. ఒక్క మాట కలిస్తే అందరికంటే ముందుగా అగ్రస్థానంలో కి వెళ్ళిపోతుంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి