కొన్ని కొన్ని సార్లు క్రికెట్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయంలో ఫీల్డర్లు పట్టే అసాధారణమైన క్యాచ్ లు ప్రేక్షకులందరికీ కూడా ఆశ్చర్య పరుస్తూ ఉంటాయన్న విషయం తెలిసిందే. ఇలాంటి స్టన్నింగ్ క్యాచ్లు అటు మ్యాచ్ ను మలుపు తిప్పడమే  కాదు అటు ఫీల్డర్ కి కూడా ఎంతగానో గుర్తింపు తెచ్చి పెడుతూ ఉంటాయి. ఇక ఇలాంటి అద్భుతాలు ఎక్కువగా పరిమిత ఓవర్ల ఫార్మాట్లో  జరుగుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.


 బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ఆటగాళ్లు సిక్సర్ వెళ్తుంది అనుకున్న బంతిని  గాల్లోకి ఎగిరి ఒడిసి పట్టుకోవడం లాంటివి అద్భుతమైన క్యాచ్ లకు సంబంధించిన వీడియోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవల శ్రీలంకతో ఆస్ట్రేలియా జట్టు వన్డే మ్యాచ్ ఆడుతుంది. ఇక ఈ మ్యాచ్లో భాగంగా ఇటీవల డేవిడ్ వార్నర్ పట్టిన అసాధారణమైన క్యాచ్ సంబంధించిన వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారిపోయింది. వార్నర్ పట్టిన క్యాచ్ చూసి ప్రేక్షకులే కాదు మైదానంలో ఉన్న ఆటగాళ్లు సైతం ఆశ్చర్యంలో మునిగిపోయారు అనే చెప్పాలి.


 శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఇటీవల జరిగిన తొలి వన్డే లో డేవిడ్ వార్నర్ ఒంటిచేత్తో సూపర్ మాన్లాగా గాల్లోకి ఎగిరి క్యాచ్ పట్టుకున్నాడు. ఆస్ట్రేలియా బౌలర్ అగర్ సైతం డేవిడ్ వార్నర్ పట్టుకున్న క్యాచ్ చూసి ఒక్క సారిగా షాక్ లో మునిగిపోయాడు.  శ్రీలంక ఇన్నింగ్స్ 16 ఓవర్లలో ధనుంజయ డిసిల్వా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే మిడ్ ఆన్ మీదుగా బౌండరీ  కొట్టేందుకు ప్రయత్నించాడు.  అయితే అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న డేవిడ్ వార్నర్ ఏకంగా గాల్లోకి ఎగిరి  ఒంటిచేత్తో క్యాచ్ పట్టుకున్నాడు అని చెప్పాలి. అయితే బాల్ గాల్లోకి లేవగానే బాలు వైపు చూస్తూ ఉండిపోయిన బౌలర్  అగర్.. డేవిడ్ వార్నర్ క్యాచ్ పట్టుకుంటాడు అని అస్సలు ఊహించలేదు.  కానీ అతడు  డేవిడ్ వార్నర్ ఒంటి చేత్తో క్యాచ్ పట్టడం చూసి ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: